FCI : ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులు సెప్టెంబర్ 6 నుంచి మొదలయ్యాయి.దరఖాస్తులు చేసుకోవడానికి రేపటితో ముగియనున్నాయి.అర్హత,ఆసక్తి కలిగిన అభ్యర్థులు రేపటి లోగా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.ఈ రిక్రూట్‌మెంట్‌ను నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ మరియు నార్త్-ఈస్ట్ జోన్‌లలో ఉన్న ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం కోసం ఈ దరఖాస్తులు కోరుతున్నారు.అర్హత,ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్ సైట్లో ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
నార్త్ జోన్ – 2388 ఖాళీలు,సౌత్ జోన్ – 989 ఖాళీలు,ఈస్ట్ జోన్ – 768 ఖాళీలు,వెస్ట్ జోన్ – 713 ఖాళీలు,నార్త్ ఈస్ట్ జోన్ – 185 ఖాళీలు,ఈ ఖాళీల పోస్టులకు ఎంపిక ఐనా అభ్యర్థులను తీసుకోనున్నారు.
కావలిసిన అర్హతలు
JE (EME) – 1 సంవత్సరం అనుభవంతో మెకానికల్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించాలి
JE (సివిల్) – 1 సంవత్సరం అనుభవంతో సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించాలి
AG-III (డిపో) – గ్రాడ్యుయేషన్, కంప్యూటర్ ఆపరేటింగ్ తెలిసి ఉండాలి.
స్టెనో గ్రేడ్-II – DOEC O స్థాయి సర్టిఫికేట్‌తో గ్రాడ్యుయేట్. టైపింగులో అనుభవం ఉండాలి.
నోటిఫికేషన్ ప్రకారం చూసుకుంటే ఇంజనీర్ విభాగంలో మెకానికల్‌లో సివిల్ ఇంజనీర్,ఎలక్ట్రికల్ ఇంజనీర్ మరియు జూనియర్ ఇంజనీర్,స్టెనో గ్రేడ్-3 మరియు AG-3 జనరల్,టెక్నికల్ విభాగాల్లో తీసుకోకున్నారు.