CUET UG 2023: సీయూఈటీ యూజీ అడ్మిట్ కార్డులు విడుదల

ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష యూజీ అడ్మిట్ కార్డులు విడుదల అయ్యాయి.

CUET UG 2023: ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష యూజీ అడ్మిట్ కార్డులు విడుదల అయ్యాయి. విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ హాల్ టికెట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం విడుదల చేసింది. అయితే ప్రస్తుతం ఈ నెల 21,22,23,24 తేదీల్లో మాత్రమే జరిగే పరీక్షకు మాత్రమే అడ్మిట్ కార్డులు రిలీజ్ చేశారు. వీటిని cuet.samarth.ac.in వెబ్ సైట్ నుంచి డౌన్ లౌడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. కాగా, CUET UG 2023 పరీక్ష ఈ నెల 21 నుంచి జూన్ 2 వరకు.. అదే విధంగా జూన్ 5 , 6 తేదీల్లో జరగనుంది.

 

అడ్మిట్ కార్డుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక 250 యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో ఎంట్రన్స్ కోసం ఈ పరీక్ష 13 బాషల్లో జరగనుంది. పలు నగరాలు/పట్టణాలతో పాటు విదేశాల్లోని 24 నగరాల్లో ఈ ఆన్‌లైన్‌ పరీక్ష జరగుతుంది. దాదాపు 15 లక్షల దరఖాస్తులు ఈ పరీక్ష కోసం వచ్చినట్టు సమాచారం. వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు జరిగే నీట్‌ యూజీ తర్వాత రెండో అతిపెద్ద పరీక్ష ఇది.

 

అడ్మిట్‌ కార్డు ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలంటే..(CUET UG 2023)

ముందుగా cuet.samarth.ac.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
తర్వాత హోమ్ పేజీలోని సీయూఈటీ లాగిన్ లింక్‌పై క్లిక్‌ చేయాలి.
ఆ తర్వాత వచ్చే పేజీలో డౌన్ లోడ్ Admit card అనే ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి.
అపుడు అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు ఇచ్చి.. కింద కనిపించే సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేయాలి.
అనంతరం హాల్ టికెట్ల డిస్ ప్లే అవుతుంది. దానిని డౌన్ లోడ్ చేసుకోవాలి.