Site icon Prime9

IAS coaching: టెన్త్, ఇంటర్ చదివిన విద్యార్దులకు ఐఏఎస్ కోచింగ్ అంటూ మోసాలు.. జాగ్రత్తగా ఉండాలన్న డాక్టర్ సతీష్

IAS coaching

IAS coaching

IAS coaching: టెన్త్, ఇంటర్ చదివిన విద్యార్దులకు ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ కోచింగ్ అంటూ పలు చోట్ల ప్రారంభిస్తున్నారు. అయితే వీటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని వీరినుంచి జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ చెబుతున్నారు. బిఏ డిగ్రీతో పాటు ఐఏఎస్ కోచింగ్ అంటూ అపార్టుమెంట్లలో ఈ కాలేజీలు నిర్వహిస్తున్నారు.పేరెంట్స్ ఓవర్ ఎక్సైట్ మెంట్, అవగాహన లోపం వలన ఇవి సాగుతున్నాయని ఆయన అన్నారు.

పదిలక్షలమంది రాస్తే వెయ్యి మందికే..(IAS coaching)

ఈ కోచింగ్ సెంటర్లలో ఆఫర్ చేసే బీఏ డిగ్రీ వలన ఎటువంటి ప్రయోజనాలు ఉండవని ఆయన తెలిపారు. హిస్టరీ, జాగ్రఫీ అంటూ చదివిన తరువాత వారు ప్రతిష్మాత్మక కాలేజీల్లో పీజీ కోర్సుల్లో సీటు సంపాదించలేక, జాబు దక్కక ఇబ్బందులు పడతారని అన్నారు. వాస్తవానికి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది స్కిల్ బేస్డ్ ఎగ్జామ్ అని ఏడాదికి పది లక్షలమంది రాస్తే కేవలం వెయ్యి మంది సెలక్టు అవుతారని చెప్పారు. ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ కు అవసరమైన ఎబిలిటీస్ పై పూర్తి స్దాయిలో దృష్టి కేంద్రీకరించి ప్రిపేర్ అవ్వవలసి ఉంటుందన్నారు. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో 23 మంది సివిల్ సర్వీస్ కు సెలక్ట్ అయ్యారని వారి నేపధ్యం, వారి ప్రిపరేషన్ గురించి పూర్తిస్దాయిలో వాకబు చేస్తే అసలు విషయాలు తెలుస్తాయన్నారు.

సివిల్ సర్వీస్ విజేతల్లో ఎక్కువమంది ఇంజనీరింగ్, ఐఐఎం నేపధ్యాల నుంచి వచ్చిన విషయాన్ని సతీష్ గుర్తు చేసారు. అయితే హ్యుమానిటీస్ తో కూడా విజయం సాధించిన వారు ఉన్నారని వారు ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ తదితర విద్యాసంస్దలనుంచి వచ్చిన వారు ఉంటారని అన్నారు. ఇంటర్ స్దాయి వరకు మాధమ్యాటిక్స్ ఎబిలిటీస్ ఉండి ప్రణాళిబాబద్దంగా కృషి చేసేవారికి పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు ఉంటాయని అన్నారు. అందువలన ఇంటర్ తరువాత ప్రొఫెషనల్ కోర్సుల్లో సీటు రాని వారు నిరాశపడకుండా బీబీఏ, సీఏ, డేటా సైన్స్ వంటి కోర్సులపై దృష్టి సారిస్తే మంచిదని చెప్పారు. అలా కాకుండా టెన్త్ ,ఇంటర్ తో ఐఏఎస్ కోచింగ్ అంటే కాలం, డబ్బు, వృధా అయిపోయి ఎందుకు పనికిరాకుండా పోయే అవకాశముందని అన్నారు.

ఇంటర్ తరువాత విద్యార్దులు ఎటువంటి కోర్సులు చదివితే బాగుంటుంది? సివిల్ సర్వీస్ పరీక్షకు ప్రణాళికాబద్దంగా ఎలా ప్రిపేరవ్వాలి అనే విషయాలకు సంబంధించి పూర్తి వివరాలకు డాక్టర్ సతీష్ ను 8886629883 సంప్రదించవచ్చు.

10th,12th వాళ్ళని IAS Coaching Centre's ని Trap చేయడం మొదలు పెట్టారు | Dr Satish | Prime9 Education

Exit mobile version
Skip to toolbar