Inter group Transfer: ఇంటర్ లో ఫస్టియర్ ఎంపీసీ చదివిన తరువాత సెకండియర్ లో బైపీసీ కి మారవచ్చా? లేకపోతే బైపీసీ చదివి మరలా ఎంపీసీకి మారవచ్చా? అంటే మారవచ్చనే అంటున్నారు ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్. అయితే ఇది కేవలం సీబీఎస్ఈ లో మాత్రమే సాధ్యమవుతుందని ఆయన చెబుతున్నారు.
సీబీఎస్ఈ కి మారాలి..(Inter group Transfer)
సీబీఎస్ఈ లో ఐదు సబ్జెక్టులు మాత్రమే ఎగ్జామ్స్ ఉంటాయి. కాని ఒక అదనపు సబ్జెక్టును రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తరువాత ఈ సబ్జెక్టును రాయకపోయినా పరవాలేదు.అందువలన తల్లిదండ్రులు రిజిస్ట్రేషన్ సమయంలో ఆరు సబ్జెక్టులు చేసుకుంటే మంచిదని సతీష్ చెబుతున్నారు. అందువలన సీబీఎస్ఈ లో 11 వ తరగతి అయిపోయిన తరువాత కూడ గ్రూపు మారడానికి ఇబ్బంది ఏమీ ఉండదని ఆయన స్పష్టం చేసారు. అయితే స్టేట్ బోర్డుల్లో మాత్రం ఈ చాయిస్ ఉండదు. అయితే ఇంటర్ ఫస్టియర్ బైపీసీ చదివిన వారికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు బ్రిడ్జి కోర్సులను నిర్వహిస్తున్నాయి. సెకండియర్ లో మ్యాద్స్ పరీక్ష రాయడానికి వీరు ఈ కోర్సు ద్వారా అర్హులవుతారు. ఎందుకంటే బయోటెక్నాలజీ. బయో ఇన్ఫర్మేటిక్స్ వంటి కోర్సులకు ఇంటర్ లో మ్యాధ్ప్ ఉండాలి. వీరి సౌలభ్యం కోసం ఈ బ్రిడ్జి కోర్సు నిర్వహిస్తున్నారు. అయితే స్టేట్ బోర్డుల్లో ఇంటర్ ఫస్టియర్ ఒక గ్రూపులో చదివి సెకండియర్ మరో గ్రూపులో చదవాలంటే వారు సీబీఎస్ఈ కి మారడమే ఏకైక పరిష్కారం. మిగిలిన బోర్డుల్లో అయితే 11 వ తరగతి చదివిన తరువాత గ్రూపు మారడానికి ఇబ్బంది ఉండదు.