Site icon Prime9

BARC recruitment: భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్న బార్క్.. నోటిషికేషన్ వివరాలివే

BARC recruitment

BARC recruitment

BARC recruitment: ముంబైలోని బార్క్ (బాబా అణువిద్యుత్తు పరిశోధన కేంద్రం)లో భారీగా ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 4,374 టెక్నికల్ ఆఫీసర్, స్టైపెండరీ ట్రైనీ పోస్టులను భర్తీ చేసేందుకు బార్క్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్‌ 24 నుంచి మే 22వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.

నోటిఫికేషన్‌ వివరాలు(BARC recruitment)

టెక్నికల్ ఆఫీసర్/ సి కు 181 పోస్టులు కాగా, సైంటిఫిక్ అసిస్టెంట్/ బి కు 7 పోస్టులు, టెక్నీషియన్/ బి కు 24 పోస్టులు ఉన్నాయి.

ఈ పోస్టులకు ప్రారంభ వేతనం ఇలా ఉన్నాయి. టెక్నికల్ ఆఫీసర్ ఖాళీలకు నెలకు రూ. 56,100, సైంటిఫిక్ అసిస్టెంట్ కు నెలకు రూ. 35,400; టెక్నీషియన్ పోస్టులకు రూ. 21,700 చొప్పున చెల్లిస్తారు.

ట్రైనింగ్‌ స్కీమ్‌ (స్టైపెండరీ ట్రైనీ) కింద మొత్తం 4162 ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించారు. వీటిలో కేటగిరీ 1లో 1216 పోస్టులు, కేటగిరీ 2లో 2946 పోస్టులు చొప్పున ఉన్నాయి.

ఈ పోస్టులకు స్టైపెండ్ నెలకు కేటగిరీ 1కు రూ. 24,000 నుంచి రూ. 26,000 గా నిర్ణయించారు. కేటగిరీ-2 కు నెలకు రూ. 20,000 నుంచి రూ. 22,000 వరకు చెల్లిస్తారు.

 

నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

అర్హతలు

పోస్టును అనుసరించి 10 th క్లాస్, 12th, ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్‌, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఆర్కిటెక్చర్, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, డ్రిల్లింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలర్జీ, మైనింగ్, బయో-సైన్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, తదితర విభాగాల్లో పనిచేయాల్సి ఉంటుంది.

ఈ పోస్టులకు 22-5-2023 నాటికి టెక్నికల్ ఆఫీసర్‌కు 18-35 ఏళ్ల వయస్సు ఉండాలి. సైంటిఫిక్ అసిస్టెంట్‌కు 18-30 ఏళ్ల మధ్య, టెక్నీషియన్‌కు 18-25 మధ్య,

స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 1కు 19-24 వయసు, స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 2కు 18-22 ఏళ్ల మధ్య వయోపరిమితి ఉండాలి.

పోస్టును అనుసరించి ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్.. ఆధారంగా ఎంపిక చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో అమరావతి, గుంటూరు, హైదరాబాద్, కరీంనగర్, విజయవాడ, విశాఖపట్నం లు పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.

 

Exit mobile version
Skip to toolbar