AP 10th Supplementary Exams Applications Starts from Toady: ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను సైతం విడుదల చేసింది. ఈ మేరకు టెన్త్ బోర్డు మేలో పరీక్షలు నిర్వహించేందుకు సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగానే మే 19వ తేదీన పరీక్షలు ప్రారంభం అవుతుండగా.. ఈ పరీక్షలు మే 28వ తేదీన ముగియనున్నాయి.
ఇదిలా ఉండగా, టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల కోసం నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఈ దరఖాస్తులు మే 1వ తేదీ వరకు చేసుకునేందుకు టెన్త్ బోర్డు అవకాశం కల్పించింది. నేటి నుంచి పరీక్షల ఫీజు చెల్లించుకోవాలని పేర్కొంది.
అయితే రీ కౌంటింగ్‌లో ఫీజు ఒక్కో సబ్జెక్టుకు రూ.500, రీ వెరిఫికేషన్‌కు రూ.1,000గా ఉంది. విద్యార్థులు దరఖాస్తులు చేసుకునేందుకు వెబ్ సైట్ www.bse.ap.gov.inను సందర్శించాలి. ఇందులో విద్యార్థులు లాగిన్ అయిన తర్వాత ఫీజులను చెల్లించవచ్చు.
మే 19న ఫస్ట్ లాంగ్వేజ్ మరియు పేపర్ 1(కాంపోజిట్ కోర్సు), 20వ తేదీన సెకండ్ లాంగ్వేజ్, 21వ తేదీన ఇంగ్లిష్, 22వ తేదీన గణితం, 23వ తేదీన ఫిజిక్స్, 24వ తేదీన బయోలజీ, 26వ తేదీన సాంఘిక శాస్త్రం, 27వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 (కాంపోజిట్ కోర్సు ) , 28వ తేదీన ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9.30 నిమిషాలకు ప్రారంభం కానున్నాయి.