Site icon Prime9

Yadadri Temple: యాదాద్రిలో స్వామివారి లాకెట్ విక్రయాలు ప్రారంభం

Yadadri: యాదగిరిగుట్ట లక్ష్మీనర సింహస్వామి బంగారు లాకెట్ల విక్రయాలు గత 2రోజుల నుంచి ప్రారంభమయ్యాయి. స్వామివారి రూపం, సుదర్శన నారసింహ యంత్రాన్ని లాకెట్ రూపంలో తయారు చేసి విక్రయించేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇటీవల అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో అధికారులు బంగారంతో లాకెట్లను తయారు చేయించారు.

ఒక్కో లాకెట్ ను 3 గ్రాముల బంగారంతో తయారు చేశామని, లాకెట్ ధర 17 వేల 500గా నిర్ణయించామని దేవస్థాన ఈవో గీతారెడ్డి తెలిపారు. రెండు బంగారు లాకెట్లను విక్రయించినట్లు వెల్లడించారు. కొండపైన శివాలయం ముందు ఏర్పాటు చేసిన దేవస్థాన ప్రచార శాఖ ద్వారా లాకెట్ విక్రయాలు జరుపుతున్నట్టు వివరించారు. ప్రస్తుతం 60 లాకెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కాగా, వెండి, రాగి లోహాలతోనూ లాకెట్లను తయారు చేస్తున్నామని, అవి త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు.

Exit mobile version