Surya, Chandra Grahanam: సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం రోజున సర్వ దర్శనం తప్ప మిగతా అన్ని దర్శనాలు నిలిపేస్తున్నట్టు టిటిడి వెల్లడించింది. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలోని అన్నప్రసాదం కౌంటర్స్ కూడా మూసే అవకాశం ఉంటుందని టిటిడి స్పష్టంచేసింది.
అక్టోబర్ 25న సాయంత్రం 5 గంటల 11 నిముషాల నుండి 6 గంటల 27 నిముషాల మధ్య సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఆ రోజు ఉదయం 8 గంటల 11 నిముషాల నుంచి రాత్రి 7 గంటల 30 నిముషాల వరకు దర్శనం ద్వారాలు మూసే ఉండనున్నాయి. సూర్య గ్రహణం అయిపోయిన వెంటనే దేవాలయం శుద్ధి చేసి, పూర్తయిన తర్వాత దేవాలయం ద్వారాలు భక్తులకు దర్శనం కోసం తెరుచుకోనున్నాయి.
అలాగే నవంబర్ 8న చంద్ర గ్రహణం రోజున కూడా మధ్యాహ్నం 2 గంటల 39 నిముషాల నుంచి సాయంత్రం 6 గంటల నుంచి 19 నిముషాల వరకు చంద్ర గ్రహణం ఏర్పడనుంది. గ్రహణం పట్టే సమయంలో ఆ రోజు ఉదయం 8 గంటల 40 నిముషాల నుంచి రాత్రి 7 గంటల నుంచి 20 నిముషాల వరకు దేవాలయం ద్వారాలు మూసే ఉండనున్నాయి. ఈ సమయంలో విఐపి బ్రేక్ దర్శనం, శ్రీవారి ట్రస్ట్ దర్శనం, ఆర్జిత సేవ, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు కూడా నిలిపేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.