Hanuman Jayanthi 2023: హిందూధర్మ పురాణాల ప్రకారం ఛైత్రమాసం శుక్లపక్షం శుద్ధ పౌర్ణమి రోజున పవనపుత్రుడు, అంజనీసుతుడైన హనుమంతుడు జన్మించాడని ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఇక హనుమంతుడు జన్మించిన ఈ పవిత్రమైన రోజును హనుమాన్ జయంతిగా విశ్వసిస్తూ ఈ రోజున ఘనంగా వేడుకలను చేస్తారు. ఈ నేపథ్యంలో హనుమాన్ జయంతి రోజున చేయాల్సిన నియమాలేంటి.. శనిదోష నివారణకు పాటించాల్సిన పరిహారాలేంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. హనుమాన్ జయంతి రోజున సుందరకాండ పారాయాణం చేయడం ఎంతో మంచిది.
2. హనుమాన్ జయంతి రోజున బెల్లం, నూనె లేదా నెయ్యిలో సింధూరం కలిపి ఆంజనేయ దేవాలయంలో సమర్పించడం వల్ల ఆ రామభక్తుడి అనుగ్రహం లభిస్తుంది. ఇలా చేయడం వల్ల ఆంజనేయుడు సంతోషించి, మీ కోరికలన్నీ నెరవేరుస్తాడని హింధూధర్మాలు చెప్తున్నాయి.
3. హనుమాన్ జయంతి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు స్వస్తిక్, ఓం చిహ్నం వేయడం వల్ల ప్రతికూల, దుష్ట శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించవని పురాణాలు చెప్తున్నాయి.
4. హనుమాన్ జయంతి రోజున ఆంజనేయుడి ఆలయానికి వెళ్లి నెయ్యి లేదా ఆవాల నూనెతో దీపం వెలిగించడం వల్ల మంచి జరుగుతుంది.
శనిదోష పరిహారం(Hanuman Jayanthi 2023)
5. అలాగే ఆంజనేయ స్వామి ఆలయంలో దీపం పెట్టి హనుమాన్ చాలీసా 5-11 సార్లు పఠించాలి. ఇలా చేయడం వల్ల పలు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శని దోషం నుంచి విముక్తి లభిస్తుంది.
6. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే వారు హనుమాన్ జయంతి రోజున రావి చెట్టు ఆకులను 11 వరకు తీసుకుని వాటిని శుభ్రం చేసి గంధం, కుంకుమతో ఆ ఆకులపై శ్రీరాముని పేరు రాసి మాలగా తయారు చేసి హనుమంతుడికి ధరించాలి. ఇలా చేయడం వల్ల మీకు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
7. అలాగే ఈ రోజు ఆంజనేయుడి ఆలయంలో ఒక కాషాయ జెండాను సమర్పించడం వల్ల మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు.