Site icon Prime9

తెలంగాణ: యాదాద్రిలో ఆన్‌లైన్‌ సేవలు..తిరుమల తరహాలో బ్రేక్ దర్శనాలు

Yadadri

Yadadri

Yadadri: తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ క్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు సేవలు మరింత సులభతరం అయ్యాయి. తిరుమల-తిరుపతి తరహాలో యాదగిరిగుట్టలో కూడా బ్రేక్ దర్శనం ఇవ్వనున్నారు. అలాగే ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. అన్ని రకాల సేవలకు మొబైల్‌లోనే బుకింగ్స్‌ చేసుకొనేలా వెసులుబాటు కల్పిస్తున్నారు. దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

Yadadritemple.telangana.gov.in అనే వెబ్ సైట్లో లో భక్తులు తమకు కావలసిన సేవలను పొందవచ్చు. తిరుమల తిరుపతి తరహాలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అధికారులు కూడా బ్రేక్ దర్శనాల టికెట్లను తీసుకువచ్చారు. ఇక ఇప్పుడు ఆన్లైన్ సేవలను తీసుకొచ్చి భక్తులకు సేవలను సులభతరంగా అందిస్తున్నారు. దీనిపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: ముస్లిం ఇంట్లో అయ్యప్ప పీఠం.. 41 రోజులు పూజలు, నిష్ఠగా దీక్ష పూర్తి చేసిన అయ్యప్ప స్వాములు

Exit mobile version