Site icon Prime9

Diwali: దీపావళికి ఈ 4 లక్ష్మీ ఆలయాలను సందర్శిస్తే సిరిసంపదలు మీ సొంతం

famous laxmi devi temples in india

famous laxmi devi temples in india

Diwali: దేశమంతా ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ దీపావళి. చిన్నాపెద్దా తేడా లేకుండా టపాసులు కాల్చుతూ ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. అయితే ఈ దీపావళి సకల సంపదలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ లక్ష్మీ దేవిని పూజిస్తుంటారు. కాగా ఈ దీపావళి వేళ మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ నాలుగు ప్రముఖ లక్ష్మీ దేవి ఆలయాలను సందర్శించండి. మీ ఇంట సిరిసంపదలు తులతూగుతాయి. పండుగ పర్వదినాన దేశంలోని నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఆలయాలకు వచ్చి లక్ష్మీ దేవిని పూజిస్తారు. మరి ఆ నాలుగు ప్రముఖ లక్ష్మీదేవి ఆలయాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం.

గజలక్ష్మీమాత మందిరం, ఉజ్జయిని. మధ్యప్రదేశ్
ఈ దీపావళి పండుగ నాడు ఉజ్జయినిలోని గజలక్ష్మీ మాత ఆలయాన్ని ఓ సారి సందర్శించండి. ఈ ఆలయంలో పాండవుల తల్లి కర్ణుడి మాత అయిన కుంతీదేవి గజలక్ష్మీ అమ్మవారికి ఇక్కడ పూజలు చేసిందని చెబుతారు. ఈ గజలక్ష్మి మాతను విక్రమాదిత్యుడు కూడా ఆరాధించాట. దీపావళి జరిగిన రెండవ రోజున ఈ ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దూపదీప నైవేథ్యాలతో ఈ ఆలయం దీపావళి నాడు వెలుగిపోతుంది.
సర్వమంగళ దేవి ఆలయం, జగన్నాథపురి, ఒడిశా
ఒడిశా రాష్ట్రంలోని జగన్నాథపురిలో కొలువైన సర్వమంగళ దేవి ఈ ప్రాంతంలో మహాలక్ష్మి రూపంలో పూజలందుకుంటుంది. ఈ ఆలయం చాలా ప్రసిద్ధ దేవాలయం. ఈ దీపావళికి మీరు మీ కుటుంబ సభ్యులతో పాటు ఈ ఆలయాన్ని సందర్శిస్తే మీ ఇంట సిరిసంపదలకు కొదవ ఉండదని ఇక్కడి ప్రజల విశ్వాసం. దీపావళి నాడు ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
వెల్లూరు మహాలక్ష్మి దేవాలయం, తమిళనాడు
టెంపుల్ టౌన్ గా ప్రసిద్ధి చెందిన తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు మహాలక్ష్మి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ దేవాలయాన్ని సౌత్ గోల్డెన్ టెంపుల్ అని కూడా అంటారు. ఈ ఆలయం తమిళనాడులోని వెల్లూరు పట్టణంలోని మలైకోడి కొండపై ఉంది. ఇక్కడి దేవతా మూర్తి తేజోవంతమైన కాంతితో భక్తులకు దర్శనిమిస్తుంది
మాతా మహాలక్ష్మి ఆలయం, రత్లాం, మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్ రత్లాంలో ఉన్న మాతా మహాలక్ష్మి ఆలయం ఎంతో పురాతనమైనది. దీపావళి, ధంతేరస్‌ల సందర్భంగా ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఆ రోజుల్లో భక్తులు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలివచ్చి లక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఇదీ చదవండి: 21 నుండి భక్తులకు అందుబాటులో శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు

Exit mobile version