Site icon Prime9

Ganesh-Chaturthi: పంచముఖ లక్ష్మీగణపతి రూపంలో ఖైరతాబాద్‌ మహా గణపతి

Khairatabad Maha Ganapati in the form of Panchamukha Lakshmi Ganapati

Khairatabad Maha Ganapati in the form of Panchamukha Lakshmi Ganapati

Ganesh-Chaturthi: వినాయక చవితి వేడుకులకు ఖైరతాబాద్‌ మహా గణపతి ముస్తాబవుతున్నాడు. ఈ ఏడాది శ్రీ పంచముఖ లక్ష్మీగణపతి రూపంలో బొజ్జ గణపయ్య భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటి వరకూ ఖైరతాబాద్‌ గణేష్ ఉత్సవ కమిటీ.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో విగ్రహాలను ఏర్పాటు చేస్తుండగగా.. ఈసారి మాత్రం పూర్తిగా మట్టితోనే 50 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ప్రతిష్టించారు. దీంతో గణనాధుడి దర్శనం కోసం హైదరాబాద్ నుండి కాకుండా తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..సుప్రీంకోర్టు ఆదేశాలు, తెలంగాణ ప్రభుత్వ సూచనలతో 60 ఏళ్లలో మొదటి సారి ఖైరతాబాద్‌ వినాయకుడిని మట్టితో తయారు చేశారు. జూన్‌ 10 నుంచి వినాయక విగ్రహం తయారీ పనులు ప్రారంభమయ్యాయి. 150 మంది మంది కళాకారులు విగ్రహ తయారీలో పాల్గొన్నారు. ప్రత్యేకమైన పద్ధతులలో రూపొందిస్తే విగ్రహం పింగాణిలా మారుతుందని శిల్పులు చెబుతున్నారు. ఎప్పుడూ ప్రతిష్టించే ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ ప్రతిమ కంటే మరింత దృఢంగా మహా గణపతిని నిర్మిస్తున్నట్టు ఉత్సవ కమిటీ తెలిపింది.

1954లో ప్రారంభమైన ఖైరతాబాద్ గణేషుడి ప్రస్థానం 68 సంవత్సరాలుగా నిరాటంకంగా కొనసాగుతోంది. మొదట ఒక అంగుళం ఎత్తున్న విగ్రహాన్ని 1954లో ప్రతిష్ట చేశారు. అలా.. 2014 వరకు ఏటా ఒక అంగుళం పెంచుకుంటూ 60 అడుగుల వరకు ఎత్తైన గణేశ్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తూ వస్తున్నారు. పర్యావరణ వేత్తల సూచనలు, నిమర్జనానికి తరలింపులో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ఆ తర్వాత ఎత్తు తగ్గిస్తూ వచ్చారు.
వినాయకుడి కళ్లు పెట్టడంతో విగ్రహ తయారీ పూర్తయింది. ఈ సంవత్సరం 50 అడుగుల ఎత్తుతో గణేషుడు దర్శనం ఇవ్వనున్నాడు. ఖైరతాబాద్‌ గణేషుడికి కుడివైపున శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి, ఎడమ వైపున శ్రీ త్రిశక్తి మహాగాయత్రీ దేవి కొలువు తీరారు. గణేష్‌ నిమజ్జనం హుస్సేన్ సాగర్‌లోనే జరగనుంది. ఖైరతాబాద్‌ గణేష్‌ తయారీకి కోటి 50 లక్షల రూపాయల వ్యయం అయ్యింది. ఉత్సవాల కోసం సర్వం సిద్ధమైందని కోవిడ్ తరువాత ఘనంగా జరుపుకోవడానికి భక్తులు ఎదురు చూస్తున్నారని నిర్వాహకులు వెల్లడించారు…ఈసారి గణపతి కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయని లక్షలాది గా రానున్న భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు..

గతంలో 60 అడుగుల నుండి క్రమక్రమంగా ఖైరతాబాద్ వినాయకుడిని తగ్గిస్తూ వస్తున్నారు.. మొదటి రోజు గవర్నర్ తొలి పూజలు చేసి అవకాశం ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు.గడిచిన 68 ఏళ్లుగా ఖైరతాబాద్‌లో గణేశ్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మొదట ఒక అంగుళం ఎత్తున్న విగ్రహాన్ని 1954లో ప్రతిష్ట చేశారు. అలా.. 2014 వరకు ఏటా ఒక అంగుళం పెంచుకుంటూ 60 ఫీట్ల అత్యంత ఎత్తైన గణేశ్ విగ్రహాన్ని నిర్మిస్తూ వచ్చారు. పర్యావరణ వేత్తల సూచనలు, తరలింపులో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ఆ తర్వాత ఎత్తు తగ్గిస్తూ వచ్చారు. గత ఏడాది ఉత్సవాల సమయంలో మట్టి విగ్రహాలనే వాడాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఉత్సవ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

భారతదేశంలోని అతి ముఖ్యమైన హిందువుల పర్వదినం “వినాయక చవితి”. శివపార్వతుల కుమారుడైన గణనాథుడి జన్మదినాన్ని పురస్కరించుకుని “వినాయక చవితి” జరుపుకుంటారు. ఈ పండుగ భాద్రపద మాసంలో నాలుగో రోజు..అంటే చవితి రోజు ప్రారంభమై..నవరాత్రులు వైభవంగా జరుగుతుంది. వినాయకచవితి రోజు ప్రతిఇంట్లో బొజ్జగణపయ్య సందడి ఉంటే.. మండపాల్లో మాత్రం దాదాపు 11 రోజుల పాటూ లంబోదరుడు పూజలందుకుని.. ఆ తర్వాత ఊరేగింపుగా గంగమ్మ ఒడికి చేరుకుంటాడు. భారత దేశం లో ని వివిధ ప్రాంతాల్లో ఈ పండుగని “గణేష్ చతుర్ధి” లేదా “వినాయక చతుర్ధి” అని కూడా పిలుస్తారు.

Exit mobile version