Site icon Prime9

Bathukamma Festival 2022: ఏ రోజు ఏ బతుకమ్మను అలంకరిస్తారో తెలుసా?

batukamma prime9news

batukamma prime9news

 Bathukamma Festival: వర్షాకాలం ముగింపులో సెప్టెంబర్-అక్టోబర్ మధ్య ప్రతి ఏటా ఈ పండుగ వస్తుంది. ఈ పండుగను తొమ్మిది రోజులు జరుపుకుంటారు. ఈ సంవత్సరం సెప్టెంబరు 25 నుంచి ఈ పండుగ మొదలవ్వనుంది. ప్రతి ఏడాది అమావాస్య నాడు ఈ బతుకమ్మ పండుగ మొదలవుతుంది. అక్టోబర్ 3 వరకు ఈ బతుకమ్మ పండుగ జరుపుకోనున్నారు. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ (బతుకమ్మ) తో ఈ పండుగ ముగుస్తుంది. ఈ పండుగ ముఖ్యంగా బతుకమ్మను పూలతో అలంకరించి, ప్రసాదాలతో బతుకమ్మను పూజిస్తారు. తంగేడు పూలు, గునుగు పూలు, గుమ్మడి పూలు , గోరంట్ల పూలు, పేర్చుకుంటూ, పసుపుతో గౌరమ్మను చేసి బతుకమ్మను అలంకరిస్తారు. ఈ పండుగను పల్లెల్లో బాగా జరుపుకుంటారు.

బతుకమ్మను తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పూలతో అలంకరించి, తొమ్మిది నైవేద్యాలు సమర్పించి పూజలు చేస్తారు.

సెప్టెంబరు 25 మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ,
సెప్టెంబరు 26 రెండో రోజు అటుకుల బతుకమ్మ,
సెప్టెంబరు 27 మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ,
సెప్టెంబరు 28 నాలుగోవ రోజు నానబియ్యం బతుకమ్మ,
సెప్టెంబరు 29 ఐదవ రోజు అట్ల బతుకమ్మ,
సెప్టెంబరు 30 ఆరవ రోజు అలిగిన బతుకమ్మ,
అక్టోబర్ 1 ఏడో రోజు వేపకాయల బతుకమ్మ,
అక్టోబర్ 2 ఎనిమిదోవ రోజు వెన్నముద్దల బతుకమ్మ,
అక్టోబర్ 3 తొమ్మిదోవ రోజు సద్దుల బతుకమ్మ.

సెప్టెంబరు 25 మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ. మొదటి రోజు అమావాస్య రోజు ఈ పండుగ జరుపుకోనున్నారు. తంగేడు పూలతో బతుకమ్మను అలంకరించి బియ్యం పిండి, నువ్వులు, నూకలు బతుకమ్మకు నైవేద్యంగా పెడతారు.

Exit mobile version