Site icon Prime9

Women Drowned: విహారంలో విషాదం.. సెల్ఫీ తీసుకుంటూ నీట మునిగిన ఇద్దరు యువతులు

Women Drowned

Women Drowned

 

Women Drowned:విహార యాత్ర కాస్త విషాద యాత్రగా మారింది . విహారయాత్ర ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సముద్రుని రాక్షస ఆలా మృత్యువు రూపంలో దూసుకువచ్చి అక్కా చెల్లెళ్లను బలి తీసుకుంది. తమ విహార యాత్ర జ్ఞాపకాలను పదిలపరుచుకోవడానికి తీరాన్ని ఆనుకొని ఉన్న కొండరాళ్లపై నిలుచుని ఫొటో తీసుకోవడానికి వెళ్లిన అక్క చెల్లెళ్ళ ను వేగంగా దూసుకొచ్చిన అల బలి తీసుకుంది.

ఎలా జరిగిందంటే..

అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం సమీపంలో ని తంతడి బీచ్‌లోని రాకాసి అలలు ఇద్దరిని బలితీసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నూకరత్నం, కనకదుర్గ… అక్కాచెల్లెల్లు తమ కుటుంబానికి చెందిన ఐదుగురితో కలిసి తంతడి-వాడపాలెం సముద్ర తీరంలో విహారానికి ఆదివారం వచ్చారు. మొదట్లో అలలతో ఆడుకుంటూ కాసేపు సరదాగా గడిపారు. అయితే ఇద్దరు పోటీపడి అలలకు ఎదురుగా వెళ్లడంతోపాటు ఎతైన ప్రదేశంలో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించడంతో ఈ సంఘటన జరిగి నట్లు తెలుస్తోంది . వారి పక్కనే ఉన్న శిరీష అనే మహిళ కూడా అలలు ఒక్కసారిగా మీదకు రావడంతో అక్కడికక్కడే నీటిలో పడిపోయింది . వెంటనే స్పందించిన కొందరు యువకులు శిరీషను కాపాడారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆమె ప్రాణపాయ స్థితిలో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అక్కాచెల్లెళ్లు నూకరత్నం, కనకదుర్గ ను మాత్రం కాపాడలేకపోయారు. ఇక ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఒకేసారి చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Exit mobile version