Odisha High court: ఓ కేసులో ఒరిస్సా హై కోర్టు కీలక తీర్పు వెలువరించింది. అత్యాచారం కేసులో నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొంటే అది అత్యాచారం కిందకు రాదని తీర్పు వెలువరించింది. దీంతో బాధితురాలు నివ్వెరపోయింది. ఇంతకి ఈ కేసులో ఏం జరిగిందంటే?
ఒరిస్సాలోని నిమపారకు చెందిన ఓ మహిళ ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. అతను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. కొద్ది రోజులు భువనేశ్వర్ తీసుకెళ్లి కొన్ని రోజులు సహజీవనం చేశాడు. మోజు తీరాకా మహిళను వదిలి పారిపోయాడు. దీంతో కంగుతిన్న మహిళ అతడిపై కేసు పెట్టింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని మహిళ ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేసి.. కోర్టులో హాజరు పరిచారు.
ఈ కేసులో జిల్లా కోర్టులో బెయిల్ దరఖాస్తు చేసుకున్న నిందితుడి విన్నపాన్ని న్యాయస్థానం నిరాకరించింది. చేసేది లేక నిందితుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఇరు వాదనాలు విన్న న్యాయస్థానం నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చినప్పటికీ.. ఇద్దరు పరస్పర అంగీకారంతోనే సహజీవనం చేసినందుకు దీన్ని అత్యాచారంగా పరిగణించలేమని న్యాయస్థానం చెప్పింది. నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. అలాగే బాధిత మహిళను బెదిరించవద్దని.. అతడికి కోర్టు వార్నింగ్ ఇచ్చింది. కేసు విచారణకు సహకరించాలని ఇద్దరు సహకరించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/