Site icon Prime9

Lucknow Murder: యూపీలో దారుణం.. తల్లితో సహా నలుగురు చెల్లెళ్లను అతికిరాతంగా చంపేశాడు

Man murders his mother, four sisters in Lucknow: న్యూ ఇయర్ వేళ యూపీలో దారుణం చోటుచేసుకుంది. లక్నోలోని ఓ హోటల్ గదిలో ఐదుగురిని హర్షిత్ అనే యువకుడు కుటుంబాన్ని మొత్తం హత్య చేశాడు. తల్లితో సహా నలుగురిని కుమారుడు హత్య చేశాడు. కాగా, ఆగ్రా నుంచి ఆ కుటుంబం లక్నో వచ్చినట్లు తెలుస్తోంది.

వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో సమీపంలోని నాకా ప్రాంతంలో ఓ హోటల్‌కు తన కుటుంబాన్ని తీసుకెళ్లి హత్య చేశాడు. ఈ ఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. అర్షద్(24) అనే యువకుడు తన తల్లి ఆస్మాతో పాటు నలుగురు చెల్లెళ్లు ఆలియా(9), అల్షియా(19), అక్సా(16), రహమీన్(19)ను హతమార్చాడు.

సమాచారం అందుకున్న పోలీసులు 24 ఏళ్ల అర్షద్ గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే వారి శరీరాలపై గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాలే హత్యలకు కారణమని సెంట్రల్ లక్నో డీసీపీ ప్రాథమికంగా వెల్లడించారు. వీరంతా ఆగ్రాకు చెందినవారిగా తెలుస్తోందని, ఇక్కడికి ఎందుకు వచ్చారనే విషయంపై ఆరా తీస్తున్నామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ఇదిలా ఉండగా, కొంతమంది వ్యక్తులు తమ భూమిని లాగేసుకున్నారని నిందితుడు అర్షద్ ఆరోపించాడు. తన తండ్రి సహాయంతోనే తల్లిని, నలుగురు చెల్లెళ్లను హతమార్చానని నిందితుడు ఓ వీడియో విడుదల చేశాడు. ఒకవేళ వాళ్లను చంపకపోతే తన చెల్లెళ్లను ఎక్కడో విక్రయించే వారని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.

Exit mobile version