Site icon Prime9

Bengaluru techie kills 2-yr-old daughter: ఆర్థిక ఇబ్బందులతో రెండేళ్ల కూతురిని చంపేసిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్

Bengaluru

Bengaluru

Bengaluru: ఉద్యోగం లేకపోవడం, ఆర్దిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించడం కష్టమై బెంగళూరులో ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన రెండేళ్ళ కుమార్తెను తన చేతులతోనే చంపేసాడు. .శనివారం కోలారు తాలూకా కేదట్టి గ్రామంలోని సరస్సులో చిన్నారి మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు బాలిక తండ్రే ఆమెను చంపేసినట్లు కనుగొన్నారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

గుజరాత్‌కు చెందిన రాహుల్ పర్మార్‌ 2 సంవత్సరాల క్రితం తన భార్యతో కలిసి బెంగళూరులో స్థిరపడ్డాడు.తన కూతురితో ఆడుకున్నానని, ఆమెను చూసుకోవడానికి తన వద్ద డబ్బు లేకపోవడంతో ఆమెను హత్య చేయడానికి ముందు కారులో కొంత సమయం గడిపానని నిందితుడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. నవంబర్ 15 నుండి రాహుల్ మరియు అతని కుమార్తె కనిపించకపోవడంతో అతని భార్య భవ్య ఫిర్యాదు చేసింది. పర్మార్ దాదాపు 6 నెలలుగా నిరుద్యోగిగా ఉన్నాడని, బిట్‌కాయిన్‌లో డబ్బు కూడా పోగొట్టుకున్నాడని పోలీసులు తెలిపారు.

Exit mobile version