Young Man Attack with Acid on Young Girl in Annamayya District: ప్రేమికుల దినోత్సవం రోజే దారుణం చోటుచేసుకుంది. తనను ప్రేమించడం లేదని ఓ యువతిపై యువకుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలోని గుర్రంకొండ ప్యారంపల్లెలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గుర్రంకొండ మండలంలోని ప్యారంపల్లికి చెందిన ఓ యువతి(23)కి శ్రీకాంత్‌తో వివాహం కుదిరింది.
ఈ విషయం తెలుసుకున్న అమ్మచెరువు మిట్లకు చెందిన గణేశ్ తనను ప్రేమించాలని ఆమె వెంటపడుతున్నాడు. ఆ యువతి నిరాకరించడంతో కక్ష్య పెంచుకున్నాడు. ప్రేమికుల రోజే ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఇదే అదునుగా చూసిన గణేశ్.. ఆమె తలపై కత్తితో దాడి చేశాడు. అనంతరం ముఖంపై యాసిడ్ పోశాడు. తీవ్ర గాయాలతో ఉన్న యువతిని వెంటనే స్థాని ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆ యువతికి ఏఫ్రిల్ 29న వివాహం ఉండగా.. ఇంతలోనే దారుణం జరగడం అందరినీ కలిచివేసింది.
కాగా, యువతిపై యాసిడ్ దాడిని సీఎం చంద్రబాబు ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలకు సీఎం ఆదేశించారు. అలాగే యువతికి మెరుగైన వౌద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా కల్పించారు.