Site icon Prime9

Work From Home: వర్క్ ఫ్రమ్ హోంకు టాటా చెప్పనున్న ఐటి కంపెనీలు!

work from home prime9news

work from home prime9news

Work From Home: చాలా కంపెనీలు కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోం విధానాన్ని చేపట్టాయి. ఒకప్పుడు పని చేసే వాళ్ళు కావాలి. మీరు ఇంటి దగ్గర నుంచి ఐనా వర్క్ చేయండన్నారు కానీ ఇప్పుడు అలా కాదు అంతా మారిపోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ ను శాశ్వతంగా తొలగించారని అనుకుంటున్నారని తెలిసిన సమాచారం. ఇంటి దగ్గర నుంచి ఉద్యోగం చేసే వారు ఒకటి కాకుండా రెండు, మూడు ఉద్యోగాలను చేస్తున్నట్లు ఓ సర్వేలో వెల్లడించారు. ఉద్యోగులు ఇలా రెండు మూడు ఉద్యోగాలు చేయడంతో ఐటీ కంపెనీలన్ని ఈ విషయం పై చాలా సీరియస్ ఐనట్లు తెలుస్తుంది. కరోనా వేవ్‌ ప్రపంచాన్ని తలకిందులు చేసి, వివిధ రంగాల్లో కీలక మార్పులు వచ్చాయి. పని చేసే విధానంలో కూడా చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలోని చాలా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు హైబ్రిడ్‌ మోడల్‌ ను ఫాలో అవుతున్నాయి.

ప్రముఖ ఐటీ tcs కంపెనీ వారు వర్క్​ ఫ్రం హోం విధానానికి పూర్తిగా టాటా చెప్పానున్నారని తెలిసిన సమాచారం. ఇదే క్రమంలో టీసీఎస్​ ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఖచ్చితంగా ఆఫీసుకు రావాలని స్పష్టం చేసింది. వర్క్ ఫ్రం హోంకు అలవాటు పడిన వారు మాత్రం ఆఫీసుకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా ఆఫీస్ రావాలని నిబంధన విధిస్తే, ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పుడు ఐటి కంపెనీ వారికి ఈ అంశం పెద్ద తలనొప్పిగా మారింది.

Exit mobile version