Prime9

Vivo Y16 mobile: వివో సంస్థవారు విడుదల చేసిన Vivo Y16 ఫోన్ వివరాలు ఇవే!

Vivo Y16: వివో Y16 (Vivo Y16) సిరీస్ నుంచి ఇండియాలో మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేశారు. వివో Y16 (Vivo Y16) పేరుతో వచ్చిన ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ కంపెనీ ధరలోనే బెస్ట్ ఫీచర్లను మన ముందుకు తీసుకొచ్చింది. 5000 mAh బ్యాటరీ, HD+ dispaly తో 6.51 అంగుళాల screen డ్యుయల్ కెమెరా సెటప్ వంటి ఫీచర్లతో ఇది కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. మన దేశంలో దీని ధరతో పాటు ఈ ఫోన్ యొక్క స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ చదివి తెలుసుకుందాం.

ఈ స్మార్ట్ ఫోన్ వివో Y16 మీడియాtech P35 ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో పై పనిచేస్తుంది. ఈ స్మార్ట్ ఫోను 4GB RAM ర్యామ్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఎక్స్‌టెన్షన్ సపోర్ట్‌తో ర్యామ్‌ను మరో 1GB వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్‌లో 1TB వరకు memory ని ఎక్స్‌పాండ్ చేసుకునే ఆప్షన్‌తో ట్రిపుల్ కార్డ్ స్లాట్‌ను కూడా అదించనున్నారు. వివో Y16 ఆండ్రాయిడ్ 12 బేస్డ్ ఫన్‌టచ్ OS 12తో ఈ స్మార్ట్ ఫోన్ రన్ అవుతుంది. ఈ బడ్జెట్ ఫోన్‌ గేమింగ్ అవసరాలకు కూడా ఉపయోగపడుతుంది. 5000mAh బ్యాటరీతో పాటు face అన్‌లాక్, సైడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ వంటి బెస్డ్ ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది.

మన దేశంలో ఈ స్మార్ట్ ఫోన్ వివో Y16 ధర 3జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్ వేరియంట్‌కు రూ9,999గా ఉంది. 4జీబి RAM, 64 జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,499 గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ పై కొన్ని లాంచింగ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. HDFC డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల నుంచి కొనుగోలు చేస్తే వివో Y16 స్మార్ట్ ఫోన్‌కు రూ.750 వరకు క్యాష్‌బ్యాక్ వరకు వస్తుంది.

Exit mobile version
Skip to toolbar