Prime9

Share Market పుంజుకున్న స్టాక్ మార్కెట్

Stock Market: ఎట్టకేలకు దేశీయ స్టాక్ మార్కెట్ పుంజుకొనింది. గత మూడు రోజులుగా మదుపరులకు చుక్కలు చూపించాయి. నేడు స్టాక్ మార్కెట్లు ఆశాజనకంగా మారాయి. ఇండెక్స్ ప్రారంభం సమయంలో మార్కెట్టులో కొంత అస్తిరత కనపడింది. అయితే మధ్యాహ్నం సమయానికి మార్కెట్లు బలపడ్డాయి.

సెన్సెక్స్ 479 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 140 పాయింట్ల లాభంతో ముగింపు జరిగింది. సూచీలు 0.08శాతం లాభాన్ని నమోదు చేశాయి. సెన్సెక్స్ 57,625 వద్ద ముగియగా, నిఫ్టీ 17,123 వద్ద ముగిసింది. ఇండెక్స్ సెషన్ అంతటా ఒత్తిడిలో ఉన్నప్పటికీ లాభాలతో ముగిసింది. అన్ని సూచీలు గ్రీన్‌ వైపు ముగిశాయి.

ఫాస్ట్ మూవింగ్ కంష్యూమర్ ప్రాడక్ట్స్, బ్యాంకింగ్, ఆటో, రియల్టీ, ఐటి రంగాలు లాభాలతో ముగిశాయి. ఏషియన్ పెయింట్స్, అదానీ ఎంటర్‌ప్రైజ్, డాక్టర్ రెడ్డీస్ షేర్లు నష్టపోయాయి. కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో షేర్లు లాభాలని గడించిన టాప్ 10లో నిలిచాయి.

మాంద్యం, రేట్ల పెంపుదల అంశాలతో ఆందోళనల మధ్య ఆసియా మార్కెట్లో మాత్రం మిశ్రమధోరణి కనిపించింది. ప్రారంభం నుండి అస్థిరంగా ఉండటంతో పెట్టుబడిదారుల మనస్సుల్లో మాంద్యం భయాలు పట్టుకొన్నాయి. టోక్యో మరియు హాంకాంగ్‌ల స్టాక్ ఎక్సేంజ్ లలో హెచ్చు తగ్గులతో గిలగిలలాడాయి.

ఇది కూడా చదవండి:Mumbai: నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

Exit mobile version
Skip to toolbar