Site icon Prime9

Realme 32 Inch Smart TV: రియల్‌మీ సంస్థ వారు విడుదల చేసిన స్మార్ట్ టీవీ వివరాలు ఇవే!

smart tv realme prime9news

smart tv realme prime9news

Realme 32 Inch Smart TV: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో స్మార్ట్ టీవీలు అతి తక్కువ ధరతో మనకి లభిస్తున్నాయి. ఈ సేల్‌లో స్మార్ట్‌ టీవీలపై మంచి ఆఫర్లు ఉన్నట్టు తెలుస్తుంది. మరి ముఖ్యంగా బడ్జెట్ మోడల్స్ తక్కువ ధరకే మనకి దొరుకుతున్నాయి. ఇదే క్రమంలో రియల్‌మీకి చెందిన 32 ఇంచుల స్మార్ట్ టీవీలపై మంచి డిస్కౌంట్ ఫ్లిప్‌కార్ట్‌ ఇస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ధర రూ.9వేలలోపు ధరతోనే మనకి అందుబాటులో ఉండనుంది. బ్యాంక్ కార్డ్ ఆఫర్‌ను ఉపయోగించుకుంటే మరింత తక్కువ ధరకే ఈ స్మార్ట్ టీవీలను పొందవచ్చు. రియల్ మీ 32 ఇంచుల స్మార్ట్ టీవీల పై ఉన్న ఆఫర్లును చదివి తెలుసుకోండి.

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రియల్‌మీ నియో స్మార్ట్ టీవీ ధర 32 ఇంచుల స్మార్ట్ టీవీ 63శాతం డిస్కౌంట్‌తో రూ.7,999 ధరకు మనకు అందుబాటులో ఉండనుంది. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే 10శాత డిస్కౌంట్ వస్తుంది.

32 ఇంచుల హెచ్‌డీ రెడీ display తో ఈ రియల్‌మీ నియో స్మార్ట్ టీవీ వస్తోంది. ఈ స్మార్ట్ టీవిలో సౌండ్ 20 వాట్ల ఔట్‌పుట్ ఇచ్చే స్పీకర్లు ఉంటాయి. ఈ రియల్ మీ స్మార్ట్ టీవీ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌ పై రన్ అవుతుంది. దీనిలో బ్లూటూత్, వైఫై ఫీచర్లు ఉంటాయి. అయితే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, disney plus హాట్‌స్టార్ యాప్స్ దీనిలో ఉంటాయి. యూట్యూబ్‌తో పాటు మరికొన్ని యాప్స్ మాత్రమే ఈ స్మార్ట్ టీవిలో వాడుకోవడానికి ఉంటుంది.

Exit mobile version