Site icon Prime9

RBI: కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయని ఆర్బీఐ

RBI

RBI

RBI: అనుకున్నట్టుగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక రేట్లను యథావిధిగా కొనసాగించింది. మానటరీ పాలసీ కమిటీ సమావేశ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ గురువారం వెల్లడించారు. రెపో రేటు ను 6.5 శాతం వద్దనే కొనసాగిస్తున్నట్టు ప్రకటించారు. ఎంఎస్ఎఫ్, బ్యాంక్ రేట్ సైతం 6.75 శాతం దగ్గర స్థిరంగా ఉంచారు. రిటైట్ ద్రవ్యోల్బణం తగ్గుతున్న క్రమంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతం ఇవ్వాల్సిన అవసరం ఉండటంతో ఆర్బీఐ కీలక రేట్లలో మార్చక పోవచ్చనే అభిప్రాయాలు గత కొలంగా వినిపిస్తున్నాయి.

 

వరుసగా ఆరు సార్లు(RBI)

గత ఏప్రిల్ లో జరిగిన సమావేశంలో ఎలాంటి మార్పు చేయకుండా రెపో రేటును 6.5 శాతంగా కొనసాగించారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచేందుకు 2022 మే నుంచి వరుసగా ఆరు సార్లు రెపో రేటును 250 బేసిస్‌ పాయింట్ల మేర ఆర్బీఐ పెంచింది. కీలక రేట్లపై నిర్ణయాన్ని తీసుకునేందుకు రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలను ఆర్బీఐ పరిగణనలోకి తీసుకుంటుంది. ఏప్రిల్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.7 శాతానికి దిగివచ్చింది. ఇది 18 నెలల కనిష్టం.

 

Exit mobile version