RBI New Rules: మనలో చాలా మంది క్రెడిట్ కార్డ్స్ , డెబిట్ కార్డ్స్ వాడుతుంటారు.క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వాడే వాళ్ళు ఈ రూల్స్ ను తెలుసుకోవాలిసిందే. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు కార్డ్ ఆన్ ఫైల్ టోకెనైజేషన్ నిబంధలను ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ రూల్స్ ను 2022 అక్టోబర్ 1 నుంచి అమలులోకి తీసుకురావాలని ఆర్‌బీఐ ప్రకటించింది.
కార్డ్‌హోల్డర్ల ముఖ్యమైన వివరాలు సైబర్ నెరగాళ్ళ చేతిలోకి వెళ్ళకుండా ఉండేందుకు ఆర్‌బీఐ వారు టోకెనైజేషన్ అనే కొత్త పద్ధతిని మన ముందుకు తీసుకొచ్చింది. ఇప్పటికే మొత్తం 19.5 కోట్ల టోకెన్స్ జారీ అయ్యాయని తెలిసిన సమాచారం.క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉన్నవారు ఆన్‌లైన్ నుంచి వాళ్ళ పేమెంట్స్ పే చేయాలనుకునే వారు టోకెనైజ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ట్రాన్సాక్షన్స్ యొక్క వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఉదాహరణకు ఒకటి చెప్పుకుందాం.మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డుతో ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేస్తున్నారనుకుందాం.అంతకముందు సేవ్ చేసిన కార్డ్ వివరాలు సీవీవీ ఎంటర్ చేశాక ఓటీపీ నెంబర్ ను ఎంటర్ చేసి ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. అంటే మీ క్రెడిట్ కార్డ్ వివరాలు ఫ్లిప్‌కార్ట్లో సేవ్ చేసి ఉన్నాయి.కానీ ఇకపై ఇలా మీ కార్డు వివరాలు అక్కడ కనిపించవు.ఆర్‌బీఐ వారు పెట్టిన కొత్త రూల్స్ ఏంటంటే మీ డెబిట్,క్రెడిట్ కార్డ్లను టోకెనైజ్ చేయాలని కార్డ్‌హోల్డర్లను కోరడం జరిగినది.ఇలా చేయడం వల్ల మీ కార్డ్ టోకెనైజేషన్ కోసం ఏదైనా ఇకామర్స్ వెబ్‌సైట్ లేదా యాప్ ఓపెన్ చేసి పేమెంట్ ప్రాసెస్ చేసుకోవచ్చు.చెకౌట్ సమయంలో మీ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ వివరాలను ఇక్కడ ఎంటర్ చేయండి.సెక్యూర్ యువర్ కార్డ్ లేదా సేవ్ కార్డ్ యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ వ్యక్తిగత వివరాలు భద్రంగా ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తలు చదవండి : Business-News