Site icon Prime9

PC Market: భారీగా పడిపోయిన పర్సనల్ కంప్యూటర్ల రవాణా

PC Market

PC Market

PC Market: భారత మార్కెట్లో వ్యక్తిగత కంప్యూటర్ల రవాణా బాగా పడిపోయింది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో పీసీల రవాణా 29.92 లక్షల యూనిట్లకే పరిమితమైంది. ఇది గత ఏడాది తో పోలిస్తే 30 శాతం తక్కువగా నమోదు అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది తొలి త్రైమాసికం పీసీ షిప్ మెంట్ వివరాలను ఇంటర్ నేషనల్ డేటా కార్పొరేషన్ విడుదల చేసింది. 2022 ఏడాదిలో మొదటి మూడు నెలల్లో దేశ మార్కెల్లో పీసీల షిప్ మెంట్ 42.82 లక్షల యూనిట్లు గా ఉంది.

కానీ ఈ మార్చి త్రైమాసికంలో డెస్క్ టాప్ లకు డిమాండ్ ఉన్నా.. నోట్ బుక్ ల డిమాండ్ మాత్రం మరోసారి బలహానంగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 41 శాతం తగ్గినట్టు ఐడీసీ రిపోర్టు తెలిపింది. వినియెగదారుల డిమాండ్ 36.1 శాతం తగ్గితే, వాణిజ్య డిమాండ్ 25.1 శాతం తగ్గింది.

 

టాప్ లో హెచ్ పీ

కాగా, పీసీ మార్కెట్ లో 33.8 శాతం వాటాను హెచ్ పీ కంపెనీ కలిగి ఉంది. ఈ కంపెనీ పీసీల రవాణా మార్చి త్రైమాసికంలో.. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 30.2 శాతం తగ్గింది. లెనోవా కు 15.7 శాతం వాటా ఉంది. అదే విధంగా డెల్ కంపెనీ మార్కెట్ వాటా 19.4 శాతం నుంచి 13.9 శాతానికి తగ్గింది. ఏసర్ గ్రూప్ వాటా 12.3 శాతం కాగా, ఆసుస్ మార్కెట్ వాటా 6.6 శాతం గా ఉంది.

 

Exit mobile version
Skip to toolbar