Paytm Losses: డిజిటల్ పేమెంట్ కంపెనీ పేటీఎం అంటే ‘పే త్రూ మొబైల్ ” అని అర్ధం. ఇండియన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ, డిజిట్ పేమెంట్స్‌తో పాటు ఫైనాన్సియల్ సర్వీసెస్‌లో సేవలను అందిస్తోంది. ఈ సంస్థను 2010లో విజయశేఖర శర్మ వన్ 97 కమ్యూనికేషన్స్ పేరుతో స్థాపించారు. కాగా కంపెనీ మొబైల్ పే మెంట్ సేవలను అందిస్తోంది. దీంతో పాటు వినియోగదారులు తాము కొనుగోలు చేసిన వస్తువులకు చెల్లింపులు క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించే సదుపాయాలను పేటీయం తీసుకువచ్చింది. ఫైనాన్సియల్ ఇన్సిస్టిట్యూట్‌ల అంటే బ్యాంకుల భాగస్వామ్యంలో సేవలందిస్తోంది. దీంతో పాటు బిల్ పేమెంట్స్, మనీ ట్రాన్స్‌ఫర్, టికెటింగ్ సర్వీసెస్, రిటైల్ బ్రోకరేజీ ప్రొడక్ట్స్, ఆన్‌లైన్ గేమింగ్ సర్వీసులను అందిస్తోంది.
పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో 18 నవంబర్ 2021లో లిస్టు అయ్యింది. పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా పెద్ద ఎత్తున నిధులు సేకరించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో పేటీఎం విలువ రూ.13.2 లక్షల కోట్లుగా విలువ కట్టారు. ఐపీవో ద్వారా రూ.18,300 ఓట్లు సేకరించింది. దేశంలోనే ఇంత పెద్ద మొత్తంలో నిధులు సేకరించిన కంపెనీ లేదంటే అతిశయోక్తి కాదని చెప్పవచ్చు. ఒక్కో షేరు రూ.2,150కి విక్రయించారు. ప్రస్తుతం దీని షేరు ధర రూ.340 వద్ద ట్రేడ్ అవుతోంది. దీంతో ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన రిటైల్ ఇన్వెస్టర్లతో పాటు పెద్ద ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున చేతులు కాల్చుకున్నారు.
ఇక పేటీయం విషయానికి వస్తే కరోనా సమయంలో డిజిటల్ పేమెంట్‌కు విపరీతమైన డిమాండ్ పెరగడంతో మంచి లాభాలను ఆర్జించింది. ఇదే జోరుతో ఐపీఓకు వచ్చి పెద్ద ఎత్తున నిధులు సేకరించింది. ఇదిలా ఉండగా మార్చి 2022లో రిజర్వుబ్యాంకు పేటీయం పేమెంట్ బ్యాంకు కొత్త కస్టమర్లను తీసుకోరాదని ఆదేశించింది. దీనికి కారణం ఏమిటంటే కస్టమర్ల డేటాను చైనాకు కంపెనీకి లీక్ చేస్తోందని ఆర్‌బీఐ తమ ఇన్స్‌పెక్షన్‌లో కనుగొంది. దీంతో పాటు చైనా కంపెనీ పేటీఎంలో పరోక్షంగా పెట్టుబడులున్నాయని ఆర్‌బీఐ గుర్తించింది. ఇక ఈ ఏడాది జనవరి 31న రిజర్వుబ్యాంకు పేటీమయం పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 29 నుంచి కొన్ని వ్యాపారాలు చేయరాదని నిషేధించింది. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ చెక్ లేకుండా నిధులు సేకరిస్తోందని ఆర్‌బీఐ కొరఢా ఝళిపించింది. పేటియంకు చెందిన ఒక్కో వ్యాపారంపై ఆర్‌బీఐ కొరఢా ఝళిపించడంతో ఒక్కో వ్యాపారం చేజారిపోతోంది. అదే సమయంలో మార్కెట్లో ఫోన్‌పే, గూగుల్ పే రావడంతో పేటీయం వ్యాపారం కాస్తా మందగించింది.
మార్చితో ముగిసిన త్రైమాసికంలో పేటీయ నష్టాలు రూ.55.5 కోట్లకు చేరాయి. దీంతో కంపెనీ పెద్ద ఎత్తున ఉద్యోగులపై వేటు వేయాలని నిర్ణయించింది. ఒకప్పుడు ఇండియన్ ఎకనమీని శాసించిన పే టీయం ప్రస్తుతం భారీ నష్టాల్లో కూరుకుపోయి విలవిల్లాడుతోంది. బుధవారం నాడు క్యూ4 ఫలితాలు ప్రకటించినప్పుడు పేటీయం మార్చితో ముగిసిన త్రైమాసికంలో నెలకు 40 లక్షల ట్రాన్సాక్షన్ కోల్పోయినట్లు తెలిపింది. డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో రూ.15,500.35 కోట్లు రుణాలు మంజూరు చేస్తే.. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కేవలం రూ.5700.76 కోట్ల రుణాలు మంజూరు చేసిందంటే వ్యాపారం బాగా మందగించిందని తేలిపోతోంది.
అయితే బ్లూమ్‌బర్గ్ ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం పేటీయం 2026 నాటికి తిరిగి గాడిలో పడే అవకాశం ఉందని చెబుతోంది. ఉద్యోగుల్లో కోత విధించి వారి స్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించుకుంటామంటోంది. దీంతో కంపెనీ వేతనాల వ్యయం కాస్తా ఆదా అవుతుంది. అప్పటికి నియంత్రణా సంస్థల ఇబ్బందుల నుంచి బయట పడుతుందని అంచనా వేస్తోంది. భవిష్యత్తులో పలు టేకోవర్లు చేసే అవకాశం ఉంది. ఇండియన్ డిజిటల్ పేమెంట్స్‌లో ప్రస్తుతం వాల్‌మార్ట్‌కు చెందిన ఫోన్ పే, గూగుల్‌పేతో పోల్చుకుంటే పేటీయం కాస్తా వెనుకబడింది. అయితే నియంత్రణ సంస్థ అంటే ఆర్‌బీఐ నుంచి ఇబ్బందులు సమసిపోయిన తర్వాత తేలికంగా 500 మిలియన్ యూజర్ టార్గెట్‌ను చేరుకుంటుందని బ్లూమ్‌బర్గ్ తాజా నివేదికలో పేర్కొంది. ఆర్‌బీఐ నుంచి కొత్త పేమెంట్ లైసెన్సు నిబంధనలు సరళీకృతం చేసిన తర్వాత నుంచి పీటీయంకు క్రమంగా పరిస్థితులు గాడిన పడుతాయంటోంది. బ్లూమ్‌బర్గ్. మరి రూ.2,000 పెట్టి షేరు కొనుగోలు చేసిన వారు మరో రెండు సంవత్సరాలు వేచి చూస్తే తప్ప తమ డబ్బు తిరిగి వచ్చేఅవకాశాలు ప్రస్తుతానికి లేవని చెప్పవచ్చు.