New Mahindra Thar: మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) తన ప్రతిష్టాత్మక థార్ (2023 Mahindra Thar) మోడల్ లో సరికొత్త వేరియంట్ ను మార్కెట్ లో విడుదల చేసింది. థార్ ఆర్‌డబ్ల్యూడీ (రియర్ వీల్ డ్రైవ్) పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మోడల్ ఎక్స్ షోరూం ధర రూ. 9.99 లక్షల నుంచి ప్రారంభమై వేరియంట్ ఆధారంగా రూ.13.49 లక్షల మధ్యలో ఉంటుంది. అయితే ఇవి లాంచింగ్ ధరలు మాత్రమే .తొలి 10 వేల బుకింగ్స్ వరకు మాత్రమే ఈ ధరలు వర్తిస్తాయని కంపెనీ వెల్లడించింది. పెట్రోల్, డీజీల ఆప్షన్లలో ఈ మోడల్ దొరుకుతుంది.
ఈ న్యూ మోడల్ మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. మహీంద్రా థార్ (2023 Mahindra Thar) 2 డబ్ల్యూడీలో డీ117 సీఆర్డీఈ ఇంజిన్ ఉంటుంది. ట్రాన్స్‌మిషన్‌తో.. ఈ వెహికిల్ 117 BHP పవర్‌ను, 300 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. మహీంద్రా థార్ 2డబ్ల్యూడీలో mStallion 150 TGDi ఇంజిన్ కూడా ఉంది. ఇది 150 BHP పవర్‌ను, 320 NM టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది. బ్లేజింగ్ బ్రాంజ్, ఎవరెస్ట్ వైట్ వంటి రెండు రంగుల్లో ఈ థార్ లభిస్తోంది. సరికొతత్త కలర్స్‌తో థార్ లుక్ మరింత ఆకర్షణీయంగా మారింది. పెట్రోల్, డీజిల్ ఆప్షన్ల లో వీటిని తీసుకువచ్చారు.
గత మోడల్ థార్ 4WD లో కంపెనీ కొన్ని మార్పులు చేసి ఈ వెర్షన్ ను తీసుకువచ్చింది కంపెనీ. అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్ బ్రేక్ లాకింగ్ డిఫరెన్షియల్‌తో న్యూ మోడల్ పనిచేస్తుంది. మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్‌ను ఇష్టపడే వారికి LX డీజిల్ 4WD వేరియంట్‌ల్లో ఇది అందుబాటులో ఉంటుంది. 4WD పవర్‌ట్రైన్ లైనప్‌లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ మోడల్‌లోని 2.0L ఎమ్ స్టాలిన్ 150 TGDi పెట్రోల్ ఇంజిన్ ద్వారా 150 bhp, 320 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది . 2.2L mHawk 130 డీజిల్ ఇంజన్ 130 bhtor N, 130 bh torque పవర్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఉంటాయి.
18 అంగుళాల అలోయ్ వీల్స్,
ఆల్- టెర్రైన్ టైర్స్
ఈఎస్పీ మౌల్డ్డెడ్ ఫుట్‌స్టెప్స్
క్రూయిజ్ కంట్రోల్
బ్లాక్ బంపర్స్
ఎలక్ట్రిక్ ఓఆర్వీఎమ్స్
ఫాగ్ లైట్స్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్
రూఫ్- మౌంటెడ్ స్పీకర్ వంటి ఫీచర్స్ థార్ 2డబ్ల్యూడీలో ఉన్నాయి.
తక్కువ ధరకు తీసుకొస్తుండటంతో.. ఈ మహీంద్రా థార్ 2డబ్ల్యూడీ మోడల్‌కు మంచి డిమాండ్ ఉంటుందని మహీంద్రా అండ్ మహీంద్రా భావిస్తోంది. తొలిసారి మహింద్రా సంస్థ థార్ వేరియంట్ కారును 2010లో వాహనదారులకు పరిచయం చేసింది. 13 ఏళ్ల నుంచి మార్కెట్ లోకి ఎన్ని లగ్జరి కార్లు వచ్చినా.. థార్ కు మాత్రం ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది.
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/