Site icon Prime9

Mobile Number Change In SBI: బ్యాంక్ కు వెళ్లకుండానే.. ఫోన్ నెంబర్ అప్ డేట్ చేసుకోండిలా..

Mobile Number Change In Sbi

Mobile Number Change In Sbi

Mobile Number Change In SBI: ఈ రోజుల్లో చాలావరకు బ్యాంక్ లావాదేవీలు ఆన్ లైన్ లో అయిపోతున్నాయి. అసలు బ్యాంకు వెళ్లాల్సిన అవసరమే లేదు. కొన్ని బ్యాంకుల ఆన్ లైన్ లోనే ఖాతా తెరిచే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఓ స్మార్ట్ ఫోన్, అందులో డేటా ఉంటే చాలు.. ఎలాంటి లావాదేవీలనైనా క్షణాల్లో చేయొచ్చు.

మరి మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉంటే బ్యాంకుకు వెళ్లకుండా మొబైల్ నెంబర్ ఎలా అప్ డేట్ చేయాలో తెలుసుకోండి. SBI సేవింగ్స్ ఖాతాతో మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకోవాలి.

అన్ని లావాదేవీలను ట్రాక్ చేయడానికి రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్‌లను వారి సేవింగ్స్ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసుకోవాలి.

ఇలా చేసుకున్నప్పుడు తమ అకౌంట్ ద్వారా జరిగే అన్ని ట్రాన్సక్షన్స్ గురించి వెంటనే సమాచారం తెలుసుకోవచ్చు.

 

ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో నెంబర్‌ అప్‌డేట్(Mobile Number Change In Sbi)

www.onlinesbi.com ఓపెన్ చేయండి.

మీ మొబైల్ నెంబర్ మార్చుకోవడానికి, పేజీ ఎడమ పానెల్‌లో ఉన్న ‘మై అకౌంట్’ విభాగంలోని ‘ప్రొఫైల్ – పర్సనల్ డీటైల్స్ – చేంజ్ మొబైల్ నెంబర్’ క్లిక్ చేయాలి.

అకౌంట్ నెంబర్‌ను సెలక్ట్ చేసుకున్న తరువాత, మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసి, క్రింది స్క్రీన్‌పై సబ్మిట్‌పై క్లిక్ చేయండి.

మీకు రిజిస్టర్డ్ నంబర్ చివరి రెండు అంకెలను కనిపిస్తాయి.

మ్యాపింగ్ స్టేటస్ తెలియజేయడానికి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉపయోగపడుతుంది.

ఏటీఎమ్ నంచి మొబైల్ నెంబర్‌ అప్‌డేట్

సమీపంలో ఉన్న SBI ATM వద్దకు వెళ్లి, అందుబాటులో ఉన్న ఎంపికల నుంచి రిజిస్టర్ ఎంపికను సెలక్ట్ చేసుకోండి.

తర్వాత ఏటీఎమ్ పిన్‌ని టైప్ చేసుకోవాలి.

తర్వాత స్క్రీన్‌పై కనిపించే మెనూ ఆప్షన్స్ నుంచి మొబైల్ నెంబర్ ఎంటర్ ఎంచుకోండి.

స్క్రీన్‌పై ఉన్న మెను ఎంపికల నుంచి, చేంజ్ మొబైల్ నెంబర్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి.

గతంలో ఉపయోగిస్తున్న మీ మొబైల్ నెంబర్‌ను తప్పనిసరిగా ఎంటర్ చేసి ధృవీకరించాలి.

తర్వాత మీ కొత్త మొబైల్ నెంబర్‌ను నమోదు చేసి ధృవీకరించమని చెబుతుంది.

కొత్త నెంబర్, పాత మొబైల్ నెంబర్ రెండింటికి వేరువేరుగా OTPలు వస్తాయి.

ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అప్‌డేట్ అవుతుంది.

Exit mobile version