Site icon Prime9

Milk prices: ఎడా పెడా పాల ధరను పెంచుతున్న డెయిరీ కంపెనీలు!!

Milk prices

Milk prices

Milk prices: దేశంలో ఏడవ విడత పోలింగ్‌ ముగిసిన వెంటనే పాల ధరకు రెక్కలు వచ్చాయి. దేశంలోని అతి పెద్ద మిల్క్‌ కో ఆపరేటివ్‌లు అమూల్‌, మథర్‌డెయిరీలు వరుసగా లీటరుకు రూ.2 చొప్పున జూన్‌ 3 నుంచి పెంచేశాయి. ఇక నోయిడా ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న మథర్‌ డెయిరీ విషయానికి వస్తే గత ఏడాది నుంచి నిర్వహణ వ్యయం విపరీతంగా పెరిగిపోయిందని అందుకే ధర పెంచాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకుంది. ఇక గుజరాత్‌ కో ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్ ఫెడరేషన్‌ విషయానికి వస్తే అమూల్‌ బ్రాండ్‌తో పాలను పాల ఉత్పత్తులను విక్రయిస్తోంది. అమూల్‌ కూడా లీటరుకు రూ.2 చొప్పున పెంచేసింది.

పలు మార్లు ధరల పెంపు..(Milk prices)

గత రెండు సంవత్సరాల నుంచి చూస్తే అమూల్‌తో పాటు మథర్‌ డెయిరీ పలుమార్లు పాల ధరను పెంచేసింది. దీనికి వీరు చెబుతున్న కారణల విషయానికి వస్తే పాల సేకరణకు రైతుల నుంచి సేకరించే పాలకు పెద్ద ఎత్తున డబ్బు చెల్లించాల్సి వస్తోందని వివరణ ఇస్తోంది. మథర్‌డెయిర్‌ విషయానికి వస్తే పాలధరను మార్చి నుంచి డిసెంబర్‌ 2022 వరకు రూ.10 వరకు పెంచింది. ఇక అమూల్‌ విషయానికి వస్తే అదే 2022లో మూడు సార్లు పెంచేసింది. ఇక మథర్‌ డెయిరీ ఆ ఏడాది పలుమార్లు పాల ధరను పెంచింది. ఇక అమూల్‌ విషయానికి వస్తే 2022 అక్టోబర్‌లో లీటరుకు రూ.2 చొప్పున పెంచింది. ఇక మథర్‌ డెయిరీ విషయానికి వస్తే గత ఏడాది డిసెంబర్‌లో రూ.2 చొప్పున పాల ధరను పెంచింది.

ఇక పాల ధర 2022లో పలుమార్లు పెంచడానికి గల కారణం … పశువులకు కొన్ని రకాల జబ్బులని ఆల్‌ ఇండియా పశుసంవర్థక శాఖ కార్యదర్శి రాజేష్‌కుమార్‌ సింగ్‌ చెప్పారు. గత నెల ఇండియా రిటైల్‌ ద్రవ్యోల్బణం గణాంకాలను కేంద్రప్రభుత్వం విడుదల చేసింది. ద్రవ్యల్బణం 11 నెలల కనిష్టానికి దిగివచ్చింది. రిటైల్‌ ద్రవ్యోల్బణంలో పాల వాటా 6.61 శాతం ఆక్రమించిందని ఆర్‌బీఐ ఒక నివేదికలో పేర్కొంది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌ వాటా 60.3 శాతం ఆక్రయిస్తోంది. ఏడాది క్రితం ఇది 46 శాతం మాత్రమే.

ఎండల ప్రభావం..

అయితే దేశంలో ఈ ఏడాది ఎండలు విపరీతంగా కాశాయి. పాల ఉత్పత్తిపై ఎండల ప్రభావం పడిందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల నెలల్లో పెద్ద ఎత్తున పాలసేకరణ జరుగుతోంది. అయితే ఎండలకు పాల ఉత్పత్తి తగ్గిపోతోందని మథర్‌ డెయిరీ వివరణ ఇచ్చింది. దేశంలోని ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్‌ దాటిపోయింది. ఇక మన దేశంలో వ్యవసాయరంగంలో డెయిరీ కూడా ఒక భాగం. మన దేశ జీడీపీలో 5 శాతం వాటా డెయిరీ రంగం ఆక్రయిస్తోంది. ఈ రంగంపై సుమారు 8 కోటల మంది రైతులు ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. ప్రపంచంలోని పాల ఉత్పత్తిలో 25 శాతం వాటా ఇండియా ఆక్రమిస్తోంది.

 

 

Exit mobile version
Skip to toolbar