Site icon Prime9

Meta Layoffs: మరోసారి వేలాదిమందిని ఇంటికి పంపిచంనున్న మెటా

Meta Layoffs

Meta Layoffs

Meta Layoffs: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా(Meta)మరో సారి ఉద్యోగుల తొలగించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. గత నవంబర్ లో మెటా కంపెనీ చరిత్రలోనే తొలిసారిగా 11 వేల మందిని తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఈ వారంలో మరోసారి వేలాది మంది ఉద్యోగులకు లే ఆఫ్ షాక్ ఇవ్వనున్నట్టు పలు నివేదికలు వెల్లడించాయి.

 

మరోసారి కూడా వేలాది మంది(Meta Layoffs)

ప్రపంచ వ్యాప్తంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభంతో సిబ్బందిని ఇంటికి సాగనంపే ఆలోచనలో మెటా ఉన్నట్టు తెలుస్తోంది. అవసరం లేని డిపార్ట్ మెంట్లలో ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్టు సమాచారం. మేనేజర్లకు ప్యాకేజీలు ఇచ్చి వెళ్లగొట్టే ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది.

దీంతో మరోసారి కూడా వేలాది మంది ఉద్యోగులు ఇంటిబాట పట్టక తప్పదు. ఇటీవలి కాలంలో మెటాకు వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గింది. దీంతో ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడం కష్టతరంగా మారింది.

దీంతో వ్యయ నియంత్రణ చర్యలు అనివార్యమయ్యాయి. అందులో భాగంగానే ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటోంది. తీసివేతల్లో భాగంగా ఇప్పటికే ఉద్యోగులకు పింక్ స్లిప్ లు జారీ చేసేందుకు మెటా సిద్దమైంది.

ఖర్చుల విషయంలో ఆచితూచి

మరోవైపు వర్చువల్‌ రియాలిటీ వేదిక మెటావర్స్‌పై మెటా(Meta Layoffs) భారీ ఎత్తున ఖర్చు చేస్తోంది. దీని పరిశోధన, అభివృద్ధిపై పెద్ద ఎత్తున ఆర్థిక వనరులను వెచ్చిస్తోంది. దీని నుంచి ఆదాయం రాబట్టుకోవడానికి ఇంకా సమయం పడుతుంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుత వనరులను జాగ్రత్తగా వినియోగించుకొనేందుకు ఖర్చులను అదుపులో ఉంచుకుంటోంది.

అందుకే ఏ ఉద్యోగిని ఉంచాలో.. ఎవరిని తొలగించాలో చెప్పాలని డైరెక్టర్లను, వైస్ ప్రెసిడెంట్ ల నుంచి సమాచారం తీసుకుంటున్నట్టు పలు రిపోర్టులు బయటకు వచ్చాయి.

 

Exit mobile version
Skip to toolbar