LIC Share Price: ఎల్ఐసీని ముంచిన అదానీ షేర్లు.. పెట్టుబడి లాభాలకూ బ్రేక్‌

అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ నివేధిక వెలువడిన తర్వాత ఎల్ఐసీ బాగా వార్తల్లో నిలిచింది. అదానీ గ్రౌప్ షేర్లు పేక మేడల్లా కుప్పకూలడంతో ఎల్ఐసీ షేర్లు కూడా భారీగా పతనమయ్యాయి.

LIC Share Price: అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ నివేధిక వెలువడిన తర్వాత ఎల్ఐసీ బాగా వార్తల్లో నిలిచింది. అదానీ గ్రౌప్ షేర్లు పేక మేడల్లా కుప్పకూలడంతో ఎల్ఐసీ షేర్లు కూడా భారీగా పతనమయ్యాయి. కానీ , తాము నికర లాభాల్లోనే ఉన్నామని గత నెలలో ఎల్ఐసీ పేర్కొనడం గమనార్హం.

అయితే, ప్రస్తుతం ఆ షేర్లు భారీగా హరించుకుపోయాయి. దీంతో ఎల్ఐసీ పెట్టుబడుల విలువ రూ. 33,686 కోట్లకు చేరింది. అదానీ గ్రూప్లో పెట్టుబడిన దాని కంటే ఈ మొత్తంలో లాభం రూ. 3 వేల కోట్లు మాత్రమే ఎక్కువని పలు నేషనల్ పత్రికలు వెల్లడించాయి.

 

ఎల్ఐసీ చెప్పిందొకటి.. జరిగిందొకటి(LIC Share Price)

అదానీ గ్రూప్ కంపెనీలు అయిన అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్ మిషన్, ఏసీసీ, అంబుజా సిమెంట్ షేర్లలో ఎల్ఐసీ దాదాపు రూ. 30,127 కోట్లు పెట్టబడులు పెట్టింది.

అదానీ గ్రూప్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నప్పుడు ఎల్ఐసీ పెట్టుబడి విలువ భారీగా పెరిగింది. గతేడాది డిసెంబర్‌లో పెట్టుబడిపై రూ. 50వేల కోట్లు అదనంగా షేర్లు ఉన్నాయి.

కాగా, జనవరి 24న హిండెన్‌బర్గ్‌ రీసెర్చి నివేదిక బయట వచ్చాక ఆ మొత్తం భారీగా పడిపోయింది. ఈ క్రమంలో జనవరి 30న అదానీ గ్రూప్‌ కంపెనీల్లో పెట్టుబడులపై ఎల్‌ఐసీ కూడా వివరణ ఇచ్చింది. తాము పెట్టిన మొత్తం పెట్టుబడుల్లో 1 శాతం కూడా అదానీ గ్రూప్‌ కంపెనీల్లో లేవని ఎల్‌ఐసీ పేర్కొంది. ఇప్పటికీ రూ. 26వేల కోట్ల లాభాల్లో ఉన్నామని ఎల్ఐసీ తెలిపింది.

 

కొనసాగుతున్న అదానీ గ్రూప్ అప్ అండ్ డౌన్స్

హిండెన్‌బర్గ్‌ రీసెర్చి నివేదిక వచ్చి నెల రోజుల అవుతున్నా అదానీ కంపెనీల్లో మాత్రం అప్ అండ్ డౌన్స్ ఇంకా కొనసాగుతున్నాయి.

జనవరి 30 తర్వాత ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ రూ. 22,876 కోట్లు హరించుకుపోయింది.

అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ ప్రస్తుత విలువ ప్రకారం.. ఎల్‌ఐసీ పెట్టుబడుల మొత్తం విలువ రూ. 33,686 కోట్లకు చేరింది.

అంటే ఎల్‌ఐసీ పెట్టుబడి పెట్టిన దానిపై మిగిలింది రూ. 3వేల కోట్లు మాత్రమే నని తెలుస్తోంది. అదానీ కంపెనీల మార్కెట్‌ విలువ ఇంకా పడిపోతే.. పెట్టుబడి పెట్టిన మొత్తానికి ఎల్ఐసీ చేరే అవకాశం ఉందని తెలిపింది.

ఒకవేళ ఎల్‌ఐసీ తన వాటాలను విక్రయించాలని అనుకుంటే మాత్రం అదానీ గ్రూప్‌ కంపెనీ షేర్లపై మరింత ప్రెషర్ పెరిగే అవకాశం ఉంది. .