Site icon Prime9

Lenovo Tab M10 Plus: లెనోవో వారు విడుదల చేసి కొత్త ట్యాబ్లెట్ స్పెసిఫికేషన్ల వివరాలు ఇవే!

lenovo tab prime9news

lenovo tab prime9news

Lenovo Tab M10 Plus: లెనోవో బ్రాండ్ నుంచి కొత్త ట్యాబ్లెట్ లాంచ్ అయింది. లెనోవో ట్యాబ్ M10 ప్లస్ లైనప్‌లో మూడో జనరేషన్ మన దేశానికి వచ్చేసింది. ఈ స్మార్ట్ ట్యాబ్లెట్ సేల్‌ కూడా మొదలైంది. 10.61 ఇంచుల 2K display గల ఈ ట్యాబ్‌కు ప్రధాన ఆకర్షణగా ఉండనుంది. wifi తో పాటు sim కూడా సపోర్ట్ చేసే LTE వేరియంట్‌ కూడా మన ముందుకు వచ్చింది. ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ స్మార్ట్ ట్యాబ్లెట్ విడుదలైంది. లెనోవో ట్యాబ్లెట్ యొక్క స్పెసిఫికేషన్లు, ధర వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

లెనోవో ట్యాబ్ M10 Plus 3rd జనరేషన్ స్పెసిఫికేషన్లు ఈ విధంగా ఉన్నాయి..
400 నిట్స్ వరకు brightness ఉండే 10.61 ఇంచుల 2K IPS LCD display తో లెనోవో ట్యాబ్ ఎం10 ప్లస్ 3వ జనరేషన్ మన ముందుకు వస్తోంది. Tuv రీన్‌ల్యాండ్ లో బ్లూలైట్ సర్టిఫికేషన్‌ను ఈ display కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌ ఈ ట్యాబ్‌లో ఉంది. ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ స్మార్ట్ ట్యాబ్ రన్ అవుతుంది. మైక్రో SD కార్డ్ కోసం స్లాట్‌ను కూడా లెనోవో ఇచ్చింది.

లెనోవో ట్యాబ్ M10 Plus 3rd జనరేషన్ ట్యాబ్ ధర వివరాలు ఈ విధంగా ఉన్నాయి..

లెనోవో ట్యాబ్ ఎం10 ప్లస్ (3rd Gen) wifi మోడల్ ధర రూ.19,999గా ఉంది. wifi+LTE వేరియంట్ ధర రూ.21,999 గా ఉంది.ఈ-కామర్స్ కు చెందిన అమెజాన్, లెనోవో అధికారిక వెబ్‌సైట్‌ లో ఈ ట్యాబ్‌ను కొనుగోలు చేయవచ్చు.

Exit mobile version