Site icon Prime9

Lava Yuva Pro: తక్కువ ధరలో లావా స్మార్ట్ ఫోన్!

lava yuva smart phone prime9news

lava yuva smart phone prime9news

Lava mobile phones: స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ అయింది. Lava Yuva pro స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్‌లో అడుగుపెట్టింది. మెటాలిక్ డిజైన్‌తో లుక్ పరంగా ఈ స్మార్ట్ ఫోన్ ఆకర్షణీయంగా ఉంది. వెనుక మూడు కెమెరా సెటప్ ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో ప్రాసెసర్‌తో ఈ స్మార్ట్ ఫోన్‌ మన ముందుకు వస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ 5000mAh బ్యాటరీ ఈ Lava Yuva Pro ఫోనులో ఉంది.

లావా యువ ప్రొ స్పెసిఫికేషన్లు..
6.51 ఇంచుల HD+ IPS LCD డిస్‌ప్లేతో ఈ స్మార్ట్ ఫోన్ మన ముందుకు వస్తుంది. 269ppi పిక్సెల్ డెన్సిటీ, 20:9 యాస్పెక్ట్ రేషియోలో ఉంటుంది. డిస్ప్లే కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్, ఫ్రంట్ కెమెరా కోసం వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. మీడియాటెక్ హీలియో ప్రాసెసర్‌ పై ఈ స్మార్ట్ ఫోన్‌ రన్ అవుతుంది. ఐతే హీలియోలో ఈ సిరీస్ ప్రాసెసర్‌ ఉందని లావా వెల్లడించలేదు. ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ లావా బడ్జెట్ ఫోన్ వస్తోంది.

Lava Yuva Pro ధర ఈ విధంగా ఉంది
లావా యువ ప్రో స్మార్ట్‌ఫోన్‌ 3GB ర్యామ్ + 32GB స్టోరేజ్ ఉన్న సింగిల్ వేరియంట్‌లో అందుబాటులోకి ఈ స్మార్ట్ ఫోన్ వచ్చింది. దీని ధర రూ.7,799 గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ మెటాలిక్ బ్లాక్, మెటాలిక్ బ్లూ, మెటాలిక్ గ్రే కలర్ ఆప్షన్‌లలో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ లావా ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలు చేయవచ్చు.

Exit mobile version