Site icon Prime9

IRCTC HDFC Credit Card: రైలు ప్రయాణికుల కోసం సరికొత్త క్రెడిట్ కార్డు

IRCTC HDFC Credit Card

IRCTC HDFC Credit Card

IRCTC HDFC Credit Card: ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఆర్సీటీసీ) , ప్రైవేటు రంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కలిసి కొత్త క్రెడిట్‌ కార్డును తీసుకొచ్చాయి. తరచూ రైల్వే ప్రయాణాలు చేసే వారి కోసం ఈ కొత్త క్రెడిట్‌ కార్డు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ క్రెడిట్‌ కార్డు రూపే నెట్‌వర్క్‌పై పనిచేయనుంది.

ఈ కార్డుతో రైల్వే టికెట్‌ బుకింగ్‌లపై ఆదా చేసుకోవడంతో పాటు, ఇతర ప్రయోజనాలు లభిస్తాయని ఇరు సంస్థలు ప్రకటించాయి.

ఈ కార్డును హెచ్‌డీఎఫ్‌సీ, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ల ద్వారా అప్లయ్‌ చేసుకునేలా వీలు కల్పించారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ బ్రాంచ్‌ల్లో కూడా ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

 

కొత్త క్రెడిట్‌ కార్డు ఫీచర్లివే..(IRCTC HDFC Credit Card)

ఈ కొత్త క్రెడిట్‌ కార్డుతో వెల్‌కమ్‌ బెన్‌ఫిట్‌ కింద రూ. 500 విలువ చేసే అమెజాన్‌ ఓచర్ లభిస్తుంది.

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, ఐఆర్‌సీటీసీ యాప్‌లో టికెట్‌ బుకింగ్‌ చేసుకుంటే ప్రతి 100 రూపాయల కొనుగోలుపై 5 రివార్డు పాయింట్లు వస్తాయి.

హెచ్‌డీఎఫ్‌సీ స్మార్ట్‌బైలో కొనుగోలు చేసిన వారికి 5 శాతం క్యాష్‌బ్యాక్‌ వస్తుంది.

ప్రతి 100 రూపాయల కొనుగోళ్లపై ఒక రివార్డు పాయింట్‌ లభిస్తుంది. ఈఎంఐ, ఫ్యూయల్‌, వాలెట్‌ రీ లోడ్‌ లావాదేవీలు, అద్దె చెల్లింపులు, ప్రభుత్వానికి సంబంధించిన వాటిపై రివార్డు పాయింట్లు రావు.

ఏడాదిలో 8 ఐఆర్‌సీటీసీ రైల్వే లాంజ్‌ యాక్సెస్‌ ఉంటుంది.

ఏసీ టికెట్‌ బుకింగ్‌పై అదనంగా రివార్డు పాయింట్లు కూడా లభిస్తాయి.

కార్డు వచ్చిన 30 రోజుల్లో యాక్టివేట్‌ చేసుకుంటే రూ. 500 వెల్‌కమ్‌ గిఫ్ట్‌ వస్తుంది. అలాగే కార్డు జారీ చేసిన 90 రోజుల్లో రూ. 30 వేలు కొనుగోలు చేస్తే మరో రూ. 500 గిఫ్ట్‌ ఓచర్
రూపంలో లభిస్తుంది.

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, యాప్‌లో లావాదేవీ ఛార్జీలపై 1 శాతం రాయితీ లభిస్తుంది.

 

 

Exit mobile version