Site icon Prime9

Infinix Products: ఇన్ఫినిక్స్ సంస్థ వారు విడుదల చేసిన ల్యాప్టాప్, స్మార్ట్ టీవీ వివరాలు ఇవే!

smart tv y1 prime9news

smart tv y1 prime9news

Infinix Products: ఇన్ఫినిక్స్ 43వై 1 ఇన్ఫినిక్స్ X2 Plus లాంచ్ వివరాలు. ఇన్ఫినిక్స్ 43వై 1 స్మార్ట్ టీవీ, ఇన్ఫినిక్స్ ఇన్‌బుక్ x2 ల్యాప్‌టాప్‌ లు నిన్న లాంచ్ చేశారు. ఈ మేరకు అధికారికంగా ట్విట్టర్లో వెల్లడించారు. వీటికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లను రిలీజ్ చేసింది. ఈ-కామర్స్ ఆన్లైన్ వెబ్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ రెండు ప్రొడక్టులు మనకి అందుబాటులో ఉంటాయని తెలిపింది.

infinix 43Y1 Smart Tv స్పెసిఫికేషన్లు..
43 ఇంచుల గల Display ఇన్ఫినిక్స్ 43వై1 స్మార్ట్ టీవీ మన ముందుకు రానుంది. 300 నిట్స్ పీక్‌ Brightness ఉంటుంది. డాల్బీ ఆడియోకు సపోర్ట్ చేసే 20వాట్ల సౌండ్ ఔట్‌పుట్ ఇచ్చే స్పీకర్లు ఈ స్మార్ట్ టీవీలో ఉంటాయి. ఈ టీవీలో అమెజాన్ ప్రైమ్ వీడియో, Disney plus హాట్‌స్టార్, Sony liv ,Zee 5 లాంటి పాపులర్ ott యాప్స్ అన్నింటికీ ఈ స్మార్ట్ టీవీ సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 512GB ర్యామ్, 4GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండే అవకాశం ఉంది.

ఇన్ఫినిక్స్ X2 Plus ల్యాప్‌టాప్‌ స్పెసిఫికేషన్లు..
15 ఇంచుల FHD display తో ఇన్ఫినిక్స్ ఇన్బుక్ X2 ప్లస్ ల్యాప్‌టాప్‌ రానుంది. అల్యూమినియమ్ అలాయ్‌తో తయారు చేసిన మెటల్ యునిబాడీని ఈ ఇన్ఫినిక్స్ X2 Plus ల్యాప్‌టాప్‌ కలిగి ఉంది. మొత్తంగా ఈ ల్యాప్టాప్ 1.58కేజీల బరువు ఉంటుంది. వీడియో కాల్స్ కోసం 1080p web cam తో ఈ ల్యాప్‌టాప్‌ వస్తుంది. 50WHr బ్యాటరీతో ఈ ల్యాప్‌టాప్‌లో ఉండనుండగా, 65వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు ఇది సపోర్ట్ చేస్తుంది. ఈ ల్యాప్టాప్ టైప్-సీ పోర్ట్‌తో మన ముందుకు రానుంది.

ఇదీ  చదవండి: రెడ్ మీ వారు విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ వివరాలు ఇవే.

Exit mobile version