Forbes 30 Under 30: ఫోర్బ్స్ గురువారం నాడు 30 అండర్ 30 ఆసియా జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఏషియా – పసిఫిక్ రీజియన్‌లో మొత్తం 300 మంది యువ ఎంటర్‌ప్రెన్యుర్స్, లీడర్స్, ట్రెయిల్ బ్లేజర్స్ స్థానం దక్కించుకున్నారు. వీరంతా వివిధరకాల వినూత్న వ్యాపారాలు, పరిశ్రమల వ్యవస్థాపకులు. ఇక ఈ జాబితాలో ఇండియాకు చెందిన అక్షిత్ బన్సల్, రాఘవ్ అరోరా లు…వీరు స్టాటిక్ అనే చార్జింగ్ స్టేషన్ సహ వ్యవస్థాపకులు. ఇక భాగ్యశ్రీ బన్సాలీ జైన్ ఈమె, ది డిస్పోసల్ కంపెనీ వ్యవస్థాపకురాలు. వీరంతా ఫోర్బ్స్ అండర్ 30 జాబితాలో స్థానం దక్కించకున్నారు.
ఇక బన్సల్, అరోరాలు కలిసి షరీఫ్ సర్వీసెస్‌ను.. స్టాటిక్ బ్రాండ్ పేరుతో దేశవ్యాప్తంగా తమ సేవలను అందిస్తున్నారు. వీరు స్థాపించిన కంపెనీ దేశవ్యాప్తంగా ఎలక్ర్టిక్ వెహికిల్స్ చార్జింగ్ స్టేషన్ నెట్‌వర్క్ సేవలను ఆఫర్ చేస్తున్నారు. కాగా ఈ కంపెనీ కోసం వీరు 27.5 మిలియన్ డాలర్ల పెట్టుబడులు సేకరించారు. దీని ద్వారా ఈ ఏడాది 9.9 మిలియన్ డాలర్ల రెవిన్యూ సాధించే అవకాశాలున్నాయి. 2025 నాటికి తమ నెట్‌వర్క్‌ను రెట్టింపు అంటే 16వేల చార్జింగ్‌స్టేషన్‌కు విస్తరించాలనుకుంటున్నారు.
ఇక భాగ్యశ్రీ జైన్ విషయానికి వస్తే ఆమె ది డిస్పోసల్ కంపెనీ (టీడీసీ)ని 2020లో స్థాపించారు. దీని ద్వారా ప్లాస్టిక్ న్యూట్రాలిటిని ప్రమోట్ చేయాలనే కాన్సెప్ట్ తీసుకువచ్చారు. కాగా టీడీసీ వినియోగదారులకు, కంపెనీలకు ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని కోరుతూ ప్రచారం చేస్తోంది. వెస్ట్ ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేయిస్తారు. వచ్చిన డబ్బును ప్లాస్టిక్ సేకరించిన కార్మికులు, రీసైక్లింగ్ చేసిన కార్మికులకు వేతనాలు ఇస్తారు. ఇక ఈ జాబితాలో కె-పాప్ గర్ల్ బ్యాండ్ లైవ్‌కు చెందిన వారు. సింగపూర్‌కు చెందిన ట్రాక్, అండ్ ఫీల్డ్ అథ్లెట్ వెరోనికా శాంతి పెరేరియా, జపాన్‌కు చెందిన యువ మేయర్ రోసుకే తకాసిమా చోటు దక్కించుకున్నారు. కాగా పోర్బ్స్ ఆసియా మొత్తం 4,000 మంది యువ వ్యాపారుల నుంచి వారి వ్యాపారాలు, వారి ఫండింగ్, రెవిన్యూ, వారి వ్యాపారం సమాజంపై ఎలా ఉంటుంది తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ర్యాంకింగ్ ఇచ్చింది. ఇక ఈ ప్యానెల్‌లో హెచ్‌సీఎల్ టెక్‌కు చెందిన రోషిణి నాడార్ మల్హోత్రా,ఇన్పోసిస్‌కు చెందిన షిబూలాల్, సినోవేషన్ వెంచర్స్‌కు చెందిన కాయి ఫు లీలు ఉన్నారు.