HP Chromebook: క్రోమ్ బుక్ పేరుతో హెచ్ పీ సరికొత్త ల్యాప్ టాప్ తీసుకొచ్చింది. గూగుల్ క్రోమ్ ఓఎస్ ఈ ల్యాప్ టాప్ అందుబాటులోకి వచ్చింది. స్కూల్, కాలేజ్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ ల్యాప్ టాప్ ను రూపొందించినట్టు కంపెనీ వెల్లడించింది.
Intel Celeron N4500 ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ల్యాప్ ఎంతో స్టయిలిష్ గా, శక్తిమంతంగా ఉంటుందని కంపెని తెలిపింది. ఎడ్యుకేషన్ తో పాటు గేమింగ్ కూడా సపోర్ట్ చేయనుంది.
ఈ సరికొత్త ల్యాప్ ధరను రూ. 28,999 గా నిర్ణయించారు. ఆన్ లైన్ లో ఈ ల్యాప్ ను కొననుగోలు చేయవచ్చు.
క్రోమ్ బుక్ ఫీచర్లివే..(HP Chromebook)
HP Chromebook డ్యూయల్ టోన్ ముగింపుతో సాధారణ 15 అంగుళాల ల్యాప్‌టాప్ లా కనిపిస్తుంది. ఇందులో 250 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంటుంది.
వీడియో కాల్స్ కోసం వైడ్ విజన్ హెచ్‌డీ కెమెరా, మైక్రోఫోన్ ఉన్నాయి. ట్రాక్ ప్యాడ్‌ను పెద్దగా ఇచ్చారు. వివిధ రకాల గెశ్చర్స్‌కు ఇది సపోర్ట్ చేస్తుంది.
ఆడియో కోసం రెండు స్పీకర్లను అమర్చారు. ఈ ల్యాప్‌టాప్‌లో అమర్చిన బ్యాటరీ 11.5 గంటల వరకు పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.
గూగుల్ అసిస్టెంట్, గూగుల్ క్లాస్‌రూమ్ సర్వీస్‌లకు ఈ ల్యాప్‌టాప్ సపోర్ట్ చేస్తుంది.
ఫైల్స్, ఫొటోలను తొందరగా పంపిచటానికి హెచ్‌పీ (HP) క్విక్ డ్రాప్ సదుపాయం ఉంది. వేగవంతమైన కనెక్టివిటీ కోసం వైఫై 6 అందిస్తున్నారు.
మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 కూ ఈ ల్యాప్‌టాప్ సపోర్ట్ చేస్తుంది. పెద్ద కీబోర్డ్ మరియు ట్రాక్‌ప్యాడ్ తో పాటు Google Play Store నుంచి నేరుగా యాండ్రాయిడ్ యాప్‌లను కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.