Site icon Prime9

Hero Motocorp: హీరోమోటో కార్ప్‌ నుంచి కొత్తరకం ఎలక్ట్రిక్ టూ వీలర్

Hero Motocorp

Hero Motocorp

Hero Motocorp: ద్విచక్ర వాహన దిగ్గజం హీరోమోటో కార్ప్‌ ఎలక్ట్రిక్ టూ వీలర్‌ సెగ్మెంట్‌లో కొత్త రకం మోడల్‌ను ప్రవేశపెట్టనుంది. కొత్త మోడల్‌ ధర విషయానికి వస్తే లక్షల రూపాయల కంటే తక్కువ రేటుకు విక్రయించనున్నట్లు కంపెనీ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం హీరో మోటో రెండు రకాల ఎలక్ర్టిక్‌ స్కూటర్లను డీడి రేంజీ పేరుతో విక్రయిస్తోంది. వాటి ధర రూ.1 లక్ష.. రెండోది రూ.1.5 లక్షల మధ్యలో విక్రయిస్తోంది. ఈ ఏడాది ప్రథమార్ధంలో తమ పోర్టుపోలియోను విస్తరించాలనుకుంటన్నట్లు… ముఖ్యంగా మాస్‌ సెగ్మెంట్‌కు చేరే విధంగా ప్లాన్‌ చేస్తున్నట్లు కంపెనీ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ ఎమెర్జింగ్‌ మొబిలిటి బీయు స్వదేశ్‌ శ్రీవాస్తవ చెప్పారు.

120 నగరాలకు విస్తరణ..(Hero Motocorp)

ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రతి సెగ్మెంట్‌లో మూడు రకాల మోడల్స్‌ పరిచయం చేయబోతోంది. ఒకటి ప్రీమియం, రెండో మిడ్‌, మూడు మాస్‌ సెగ్మెంట్‌ అని ఆయన వివరించారు. దీంతో ఈ ఏడాది ఈవీ మార్కెట్లో గణనీయమైన పురోభివృద్దిని సాధిస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు. ఎలక్ర్టిక్‌ సెగ్మెంట్‌లో ఈ ఏడాది మంచి వృద్దిని సాధిస్తామన్నారు. ఈ ఏడాది వచ్చే ఏడాది కూడా ఎలక్ర్టిక్‌ వాహనాల రంగంలో మంచి అభివృద్ది సాధిస్తుందన్నారు. తమ ఫోర్టు పోలియోను విదేశాలకు కూడా విస్తారిస్తామన్నారు శ్రీవాస్తవ. వీదా బ్రాండ్‌ పేరుతో దేశవ్యాప్తంగా 120 నగరాలకు విస్తరించనున్నట్లు తెలిపారు. అలాగే 180 టచ్‌ పాయింట్లకు విస్తరిస్తుందని హీరోమోటో చీఫ్‌ వివరించారు. అలాగే ఏథర్‌ ఎనర్జీతో భాగస్వామ్యం చేపడుతోంది. ఏథర్‌ 200 నగరాల్లో 2,000 చార్జింగ్‌పాయింట్లను ఏర్పాటు చేయబోతోందన్నారు. వీదా బ్రాండ్‌ను గ్లోబల్‌ మార్కెట్లో విస్తరించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. యూరోపియన్‌తో పాటు యూకే మార్కెట్లు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రవేశించనున్నట్లు తెలిపారు. హీరోమోటో సీఈవో నిరంజన్‌గుప్తా మాట్లాడుతూ.. మూలధన వ్యయం రూ.1,000 కోట్లతో పాటు ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రూ.1,500 కోట్లు మూలధనం సమకూరుస్తున్నామని చెప్పారు.

కొత్త మోడల్స్‌ గురించి ప్రస్తావిస్తూ.. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో Xoom 125, Xoom 160 స్కూటర్లను లాంచ్‌ చేయబోతున్నట్లు తెలిపారు.దీంతో పాటు ప్రీమియం మోడల్స్‌ స్కూటర్లను కూడా ప్రవేశపెట్టబోతున్నట్లు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే మంచి అభివృద్దిని సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు గుప్తా.

Exit mobile version