Site icon Prime9

Google Promotions: సంచలన నిర్ణయం తీసుకున్న గూగుల్ యాజమాన్యం

Google

Google

Google Promotions: ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో దిగ్గజ టెక్‌ కంపెనీలు లేఆఫ్‌లను అమలు చేస్తున్నాయి. దీంతో వందలకొద్దీ ఉద్యోగులు ఉపాధి కోల్పోతున్నారు.

ఈ క్రమంలో దిగ్గజం కంపెనీ గూగుల్ కూడా ఇటీవలి కాలంలో అనేక మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలోనూ గూగుల్‌ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది.

గతంలో కంటే ఈ ఏడాది తక్కువ ప్రమోషన్లు ఉంటాయని గూగుల్‌ .. ఉద్యోగులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

 

తక్కువ సంఖ్యలోనే ప్రమోషన్లు(Google Promotions)

గతంలో మాదిరిగానే ప్రమోషన్ల ప్రక్రియ మేనేజర్ల నేతృత్వంలో ఉండనుంది. అయితే ఈ ఏడాది సంస్థలో నియామాలు పెద్దగా చేపట్టకపోవడంతో ప్రమోషన్లు కూడా తక్కువ సంఖ్యలోనే ఉంటాయని సమాచారం.

అది కూడా ఎల్‌ 6, ఆ పై స్థాయిలోనే ప్రమోషన్‌లు ఉండనున్నట్లు తెలుస్తోంది. గూగుల్ తీసుకొచ్చిన కొత్త పనితీరు వ్యవస్థ ప్రకారం సీనియర్లు, నాయకత్వ స్థాయిలో తగినంత మంది ఉద్యోగులు ఉండాలి.

అందుకు అనుగుణంగా ఈ ప్రమోషన్లు ఉంటాయని యాజమాన్యం ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్‌లో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

 

ఇంటర్నల్ సర్వే తో

ప్రతి కంపెనీలో​ మధ్య స్థాయిలో పనిచేసే ఉద్యోగులే కీలకం. కానీ, ప్రమోషన్లపై వారిలో ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

ఇందుకోసం కంపెనీ గత ఏడాదే ఒక ఇంటర్నల్ సర్వే కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది.

ప్రమోషన్ల కోసం మార్చి 6 నుంచి 8 తేదీల మధ్య స్వయంగా నామినేట్ చేసుకోవచ్చని గూగుల్ ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్ లో పేర్కొంది.

ఆర్థిక సంక్షోభం కారణంగా గూగుల్‌ భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. ఈ క్రమంలో జనవరిలో గ్లోబల్ గా 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సీఈవో సుందర్ పిచాయ్ (Google Promotions) ప్రకటించారు.

అయితే తొలగించిన ఉద్యోగులకు స్థానిక చట్టాలకు అనుగుణంగా పరిహారాలను అందిస్తున్నట్లుఆయన వెల్లడించిన సంగతి తెలిసిందే.

 

 

Exit mobile version
Skip to toolbar