Google Pixil: స్మార్ట్ ఫోన్ తయారీరంగంలోకి గూగుల్ కూడా ఎంట్రీ ఇస్తోంది. ఇండియాలో డిక్సన్ టెక్నాలజీస్ ఈ స్మార్ట్ ఫోన్లను తయారు చేసిపెడుతుంది. కాగా గూగుల్ ఫిక్సిల్ 8 స్మార్ట్‌ఫోన్ ధర రూ 50,000లపై మాటే. మార్కెట్లో ఈ ఫోన్ ఆపిల్‌తో పాటు స్యాంసంగ్‌కు పోటీ ఇవ్వబోతోంది. ఇక అసలు విషయానికి వస్తే గూగుల్ ఇండియాలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ వాటాను పెంచుకోవాలనే ఆలోచనలో ఉంది. ఇండియాలో దిగుమతి సుంకం భారీగా ఉన్నా.. స్మార్ట్‌ఫోన్ తయారీకే గూగుల్ మొగ్గు చూపింది. స్మార్ట్‌ఫోన్ తయారీకి ఫాక్స్‌కాన్ సరైన భాగస్వామి అని భావిస్తోంది.
మొదటి బ్యాచ్ మేడిన్ ఇండియా స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ట్రయల్ ప్రొడక్షన్ మొదలుపెడుతుందని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. కాగా అల్ఫాబెట్ విషయానికి వస్తే గూగుల్ కంపెనీ మాతృసంస్థ. గత ఏడాది అక్టోబర్‌లో గూగుల్‌ఫిక్సిల్ స్మార్ట్‌ఫోన్ తయారు చేస్తామని ప్రకటించింది. కాగా డిక్సన్ ఫిక్సల్ ఉత్పత్తి సామర్థ్యం విషయానికి వస్తే ఏడాదికి లక్ష యూనిట్లు ఉత్పత్తి చేస్తుంది. కాగా ఇండియాలో 25 నుంచి 30 శాతం మార్కెట్ వాటాను దక్కించుకొనే అవకాశాలున్నాయి. కాగా ఉత్పత్తి చేసే స్మార్ట్‌ఫోన్లలో 80 శాతం ఇండియాలోనే విక్రయిస్తారని గూగుల్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. కాగా ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ ఆసియా మార్కెట్ల కోసం చైనా, వియత్నాంలలో తయారు చేస్తున్నారు.
దశలవారీగా విస్తరణ .. (Google Pixil)
దశలవారీగా ఉత్పత్తిని విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు డిక్సన్ టెక్నాలజీ మేనేజింగ్ డైరెక్టర్ అతుల్ లాల్ ఈ నెల 15న పూర్తి వివరాలు చెప్పకుండా చూచాయిగా తెలిపారు. ప్రస్తుతం ఆపిల్ ఇండియాలో పెద్ద ఎత్తున విస్తరించాలనుకుంటున్న నేపథ్యంలో అల్పాబెట్ కూడా ఇండియాతో దశల వారీగా తమ పట్టు సాధించుకోవాలనుకుంటోంది. ఇదిలా ఉండగా ఫాక్స్‌కాన్‌తో కలిసి రెండవ తయారీ యూనిట్‌లో స్మార్ట్‌ఫోన్లను తయారు చేసే ఆలోచనలో ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.ఇక కౌంటర్‌పాయింట్ రీసెర్చి అధ్యయనం ప్రకారం ఇండియాలో ఆపిల్ ఫోన్ రూ.50,000లు అంత కంటే ఎక్కువ ధర కలిగిన ఫోన్ల వాటా 68 శాతం ఉంటే.. స్యాంసంగ్ విషయానికి వస్తే 21 శాతం వాటా దక్కించుకుంది. ప్రస్తుతం ఇండియాలో విక్రయిస్తున్న ఐ ఫోన్ 15.. 15 ఫ్లస్ మోడల్ పాత మోడల్ ఫోన్స్‌గా చెబుతున్నారు. అలాగే స్యాంసంగ్ సూపర్ ప్రీమిమం మోడల్స్ కూడా ఇండియాలోనే ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నారు. మరి గూగల్ ఫిక్సల్ 8 స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఇటు ఆపిల్‌కు, అటు స్యాంసంగ్‌కు గట్టి పోటీ ఇవ్వగలదా లేదా అనేది వేచి చూడాల్సిందే.