Gold price today: మహిళలకు బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే?

Gold rates in Hyderabad today surges: మహిళలకు బిగ్ షాక్ తగిలింది. బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. భారీగా ధరలు పెరగడంతో మహిళలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో మరింత భారంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశంలో కూడా ప్రభావం చూపుతోంది. దీంతో దేశంలోని బులియన్ మార్కెట్‌లో కూడా ఈ ధరలు పైపైకి చేరుతున్నాయి.

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. 10 గ్రాముల గోల్డ్ ధర రూ.700 పెరిగింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.71,600కు చేరింది. ఇక, 24 క్యారెట్ల 10 గ్రాముల వెండి ధర రూ.760 పెరిగింది. దీంతో 10 గ్రాముల గోల్డ్ ధర 99.9 శాతం ప్యూరిటీ ధర రూ.78,110 పలుకుతోంది. దీంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కేజీ వెండిపై రూ.2000 పెరగడంతో ప్రస్తుతం రూ.లక్షకు చేరింది. ఈ ధరలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపుగా ఇవే కొనసాగుతున్నాయి.

విజయవాడలో 10 గ్రాముల బంగారం ధర రూ.78,110 ఉండగా.. విశాఖపట్నంలో 10 గ్రాముల బంగారం ధర రూ.78,110గా ఉంది. ప్రొద్దుటూరులో 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.78,110గా ఉంది. బంగారం స్వచ్ఛత గురించి తెలుసుకోవాలంటే ఈ విషయాలు పరిశీలించాల్సి ఉంటుంది. బంగారం స్వచ్ఛతను ముఖ్యంగా క్యారెట్లలో మాత్రమే కొలుస్తారని నిపుణులు చెబుతున్నారు. క్యారట్ల వాల్యూ ఆధారంగా బంగారం ప్యూరిటీ, రేట్ పెరుగుతాయి.

స్వచ్ఛమైన బంగారం 24 క్యారెట్లుగా పిలుస్తారు. అంటే ఇందులో 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం అని తెలుస్తోంది. ఇవి ఎక్కువగా కాయిన్స్, బార్స్, బిస్కెట్ల రూపంలో ఉంటాయి. ఇక, ఆభరణాలను తయారు చేసేందుకు మాత్రమే 22 క్యారట్ల స్వచ్ఛతతో ఉన్న బంగారాన్ని ఉపయోగిస్తారు. ఇందులో ఇతర లోహాలు కలుపుతారు. బంగారంతో చేయించుకునే నగలు 22 క్యారెట్లు, 916 స్వచ్ఛతతో ఉంటాయి. వీటిని 91.6శాతంతో గుణిస్తే బంగారం స్వచ్ఛత తెలుస్తోంది.