Go Fisrt: ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న విమానాయాన సంస్థ ‘గో ఫస్ట్’ తమ పైలట్లకు భారీ ఆఫర్ ఇచ్చింది. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న కంపెనీ నుంచి ఎవరు వెళ్లిపోకుండా ఉండేందుకు భారీ ఎత్తున జీతాలను పెంచబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సంస్థ.. పైలట్లకు ఇంటర్నల్ గా మెయిల్ పంపిపనట్టు బ్లూమ్ బర్గ్ నివేదించింది.
స్పెషల్ బోనస్ కు రెడీ(Go Fisrt)
కాగా, గో ఫస్ట్.. కెప్టెన్ లకు నెలకు రూ. 1 లక్ష జీతం, ఫస్ట్ ఆఫీసర్స్ కు రూ. 50 వేల వరకు అధిక వేతనం ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్టు సమాచారం. ఈ విషయాన్ని మెయిల్ లో స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అదే విధంగా పెంచిన జీతాలు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలియజేసింది. మరో వైపు ఇప్పటికే సంస్థ నుంచి బయటకు వెళ్లిన వారు ఉపసంహరించుకోవడానికి జూన్ 15 వరకు అవకాశం కల్పించింది. అలా రాజీనామా వెనక్కి తీసుకున్న వారికి కూడా జీతాల పెంపు ఉంటుందని పేర్కొన్నట్టు సమాచారం. అంతేకాకుండా ఎన్నో ఏళ్లుగా గో ఫస్ట్ లో పనిచేస్తున్న వారికి స్పెషల్ బోనస్ కు రెడీ అయిందని బ్లూమ్ బర్గ్ తెలిపింది.
వేతన పెంపు వ్యూహాంతో
కరోనా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రయాణాలు పుంజుకున్నాయి. కానీ, విమానయాన పరిశ్రమలో సిబ్బంది కొరత మాత్రం ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా పైలట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపధ్యంలో అనేక సంస్థలు నియామక ప్రక్రియను వేగవంతం చేశాయి. ఎయిర్ ఇండియా కూడా భారీ ఎత్తున నియామకాలు చేపట్టింది. దీంతో ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న గో ఫస్ట్‌ను నుంచి పైలట్లు ఇతర సంస్థలకు వెళ్లిపోతున్నారు. అసలే ఆర్థిక కష్టాలు ఉంటే.. సిబ్బంది సంస్థ ను వీడనుండటంతో వేతన పెంపు వ్యూహాంతో గో ఫస్ట్ ముందుకు వచ్చింది.