Elon Musk: మళ్లీ ప్రపంచ కుబేరుడిగా మారిన ఎలాన్ మస్క్

ప్రపంచలోనూ అత్యంత ధనవంతుడిగా టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ మళ్లీ అవతరించాడు. ఆ స్థానంలో ఇప్పటివరకు ఉన్న ఎల్‌వీఎంహెచ్‌ అధినేత బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ సంపద 2.6 శాతం పడిపోవడంతో ‘బ్లూమ్‌ బెర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ’లో మస్క్‌ టాప్ కి చేరారు.

Elon Musk: ప్రపంచలోనూ అత్యంత ధనవంతుడిగా టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ మళ్లీ అవతరించాడు. ఆ స్థానంలో ఇప్పటివరకు ఉన్న ఎల్‌వీఎంహెచ్‌ అధినేత బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ సంపద 2.6 శాతం పడిపోవడంతో ‘బ్లూమ్‌ బెర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ’లో మస్క్‌ టాప్ కి చేరారు. గత డిసెంబర్ లో ఎలాన్ మస్క్ ను దాటి ఆర్నాల్డ్ కుబేరుడిగా తొలి స్థానానికి చేరుకున్నారు. ట్విటర్ కొనుగోలు చేసిన తర్వాత టెస్లా కంపెనీ షేర్ విలువ పతనం అవ్వడంతో మస్క్ సంపద తరిగిపోయింది.

 

 షేర్లు 66 శాతం రైజ్(Elon Musk)

మరో వైపు అదే సమయంలో లగ్జరీ వస్తువులు కొనుగోలు బాగా పెరిగాయి. దీంతో ఎల్వీఎమ్ హెచ్ షేర్లు భారీగా పెరిగాయి. అయితే తాజాగా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో మళ్లీ లగ్జరీ వస్తువులు డిమాండ్ తగ్గిపోయింది. దీంతో ఆర్నాల్డ్ షేర్స్ కుంగిపోయాయి. ఈ క్రమంలో మస్క్ మొదటి స్థానానికి ఎగబాగారు. మస్క్ వ్యక్తిగత సంపద లో ఎక్కువ భాగం టెస్లా షేర్లదే. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు టెస్లా షేర్లు 66 శాతం పుంజుకున్నాయి. దీంతో మస్క్ సంపద 55.3 బిలియన్ డాలర్లు పెరిగి.. 192.3 బిలియన్ డాలర్లకు చేరింది. రెండో స్థానానికి పడిన ఆర్నాల్డ్ సంపద 186.6 బిలియన్ డాలర్లు.

 

ఆర్థిక మాంద్యం భయాలతో(Elon Musk)

 

ఇటీవల అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాలు నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఆ ప్రభావం లగ్జరీ బ్రాండ్‌లపై స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో సదరు కంపెనీల విలువ 30 బిలియన్‌ డాలర్ల నష్టాన్ని మూటగట్టుకున్నాయి. వీటిలో ఆర్నాల్ట్‌కు చెందిన ఎల్‌వీఎంహెచ్‌ కూడా సుమారు 5 శాతం పడిపోయింది. మరో ఫ్రెంచ్‌ లగ్జరీ సంస్థ కేరింగ్‌ ఎస్‌ఏ కూడా 2 శాతం నష్టాలను చవి చూసింది. ఇలా లగ్జరీ బ్రాండ్ల షేర్లు పతనం అవ్వడం.. కుబేరుడైన బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌పై తీవ్రంగానే పడింది. దీంతో ఆయన మొత్తం సంపదలో కేవలం ఒక్క రోజే 11 బిలియన్‌ డాలర్లు కరిగిపోయింది.