Site icon Prime9

Elon Musk: ఆఫీసులో 40 గంటలు ఉండాలి.. ట్విట్టర్ సిబ్బందికి ఎలన్ మస్క్ మొదటి ఇమెయిల్

Twitter

Twitter

Twitter: ట్విట్టర్ యజమాని ఎలన్ మస్క్ తన సిబ్బందికి మొదటిసారిగా ఇమెయిల్ పంపారు. ఎలన్ మస్క్ ఆర్థిక దృక్పథం గురించి చెబుతూ సందేశాన్ని షుగర్‌కోట్ చేయడానికి మార్గం లేదని అన్నారు. రిమోట్ పని ఇక పై అనుమతించబడదని మరియు ఉద్యోగులు వారానికి కనీసం 40 గంటల పాటు కార్యాలయంలో ఉండాలని ఎలన్ మస్క్ చెప్పారు. ఇది మినహాయింపులకు లోబడి ఉంటుందని చెప్పారు.

మస్క్ ట్విట్టర్ లో దాదాపు సగం మంది ఉద్యోగులను, ఎగ్జిక్యూటివ్ లను తొలగించారు. ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ ధరను $8కి పెంచారు. దానికి యూజర్ వెరిఫికేషన్‌ను జోడించారు. ట్విటర్ ఆదాయంలో సగ భాగాన్ని సబ్‌స్క్రిప్షన్‌ల ఖాతాలో చూడాలని మస్క్ ఇమెయిల్‌లో సిబ్బందికి చెప్పారు.

Exit mobile version