Credit Card: క్రెడిట్ కార్డ్ వాడతున్నవారు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. కొద్ది రోజులు వాడిన తర్వాత వాటిని అప్ గ్రేడ్ చేసుకోవాలని సంబంధిత బ్యాంక్ నుంచి కాల్స్ వస్తుంటాయి. ఇందులో మంచి ఆఫర్లను వారు అందిస్తుంటారు. అలాంటి అప్ గ్రేడ్ సమయంలో కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి.
ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..! (Credit Card)
క్రెడిట్ కార్డ్ వాడతున్నవారు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. కొద్ది రోజులు వాడిన తర్వాత వాటిని అప్ గ్రేడ్ చేసుకోవాలని సంబంధిత బ్యాంక్ నుంచి కాల్స్ వస్తుంటాయి. ఇందులో మంచి ఆఫర్లను వారు అందిస్తుంటారు. అలాంటి అప్ గ్రేడ్ సమయంలో కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి.
వినియోగదారుడు తొలిసారి క్రెడిట్ కార్డు తీసుకున్నపుడు బ్యాంకులు ప్రవేశ స్థాయి ప్రయోజనాలు ఉన్న కార్డుని అందజేస్తాయి. ఇలాంటి కార్డులతో మెుదట రివార్డు పాయింట్లు.. క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందించవు. కార్డు వాడుతున్న కొద్ది.. ఆదాయం పెరగడంతో పాటు.. క్రెడిట్ స్కోర్ కూడా పెరుగుతుంది. అపుడు మన అవసరాలకు అనుగుణంగా.. ప్రయోజాలను అందించే క్రెడిట్ కార్డుకి అప్‌గ్రేడ్ అయ్యేందుకు సంబంధిత బ్యాంకులు అవకాశం కల్పిస్తాయి.
ఈ విషయాలను మర్చిపోవద్దు..
క్రెడిట్ కార్డు ద్వారా చేసే ఖర్చులను వివిధ కేటగిరీల్లోకి వస్తాయి. మనం ఎక్కువ షాపింగ్ చేస్తే.. షాపింగ్ కార్డు ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిపై రాయితీ లభిస్తుంది.
దీనికి తగినట్లుగానే.. వినియోగదారులు కార్డ్ ను అప్ గ్రేడ్ చేసుకోవాలి. చాలా మంది ఏదో ఒక క్రెడిట్ కార్డు వస్తే చాలు అనుకుంటారు.
అలాగే అప్ గ్రేడ్ విషయంలో వారికి పెద్దగా అవగాహన ఉండదు. ముందుగా.. ఏ రకమైన కార్డులు ఉపయోగకరమో తెలుసుకుని వాటిని తీసుకోవాలి.
కొన్ని బ్యాంకులు.. ప్రత్యేకమైన బ్రాండ్లపై ఆఫర్లను అందిస్తాయి. మరికొన్ని షాపింగ్ కి ప్రయోజనాల్ని వర్తింపజేస్తాయి.
ఇందులో అవసరానికి తగిన విధంగా ఎలాంటి కార్డు సరిపోతుందో చూసుకోవాలి. క్రెడిట్ కార్డు తీసుకునే సమయంలో చెల్లించే రుసుముకి వచ్చే ప్రయోజనాలకి పొంతన ఉండేలా చూసుకోవాలి.
క్రెడిట్ పరిమితి పెరగాలి..
మన క్రెడిట్ కార్డుని అప్ గ్రేడ్ చేసుకున్న సమయంలో లిమిట్ కూడా పెరుగుతుంది. కొన్ని అత్యవసర పరిస్థితుల్లో క్రెడిట్ కార్డ్ ఉపయోగపడుతుంది.
అందుకే ఎక్కువ క్రెడిట్ లిమిట్ ఉండేలా చూసుకోవాలి. కొత్త కార్డు వల్ల అధిక ప్రయోజనాలు ఉంటేనే దానికి వెళ్లాలి.
మరోవైపు ప్రస్తుతం ఉన్న కార్డు వల్ల మీరు అత్యధికంగా పొందుతున్న లబ్ధిని కొత్త కార్డు ద్వారా కోల్పోకుండా చూసుకోవాలి.
అలాగే ఈ కార్డులో ఉన్న రివార్డు పాయింట్లు కొత్త కార్డుకి బదిలీ అయ్యేలా చూసుకోవాలి.