Site icon Prime9

Boat SmartWatch: బోట్ స్మార్ట్ వాచ్ రూ.1299 మాత్రమే.. త్వరపడండి!

boat smart watch prime9news

boat smart watch prime9news

Boat SmartWatch: బోట్ సరికొత్త స్మార్ట్ వాచ్‌ను చాలా తక్కువ ధరకే లాంచ్ చేసింది. బోట్ వేవ్ స్టైల్ పేరుతో బడ్జెట్ వేరబుల్ డివైజ్‌ను ఇండియన్ మార్కెట్‌లోకి విడుదల చేసింది.ఈ కంపెనీ స్మార్ట్ వాచ్‌ బడ్జెట్ ధరలోనే బెస్ట్ ఫీచర్లను మనకి అందుబాటులోకి తెచ్చింది. ఈ స్మార్ట్ వాచ్లో హెల్త్, ఫిట్‌నెస్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ లేటెస్ట్ స్మార్ట్ వాచ్ ధర, స్పెసిఫికేషన్లు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

బోట్ వేవ్ స్టైల్ స్మార్ట్ వాచ్ స్పెసిఫికేషన్లు ఈ కింది విధంగా ఉన్నాయి..
1.69 అంగుళాల స్క్వేర్ షేప్డ్ display తో మన ముందుకు వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ను మెటల్ బాడీతో దీనిని తయారు చేశారు. దీనిలో 24/7 హార్ట్ రేట్ సెన్సార్, SPO2 మానిటర్లు ఈ వాచ్ కు అమరి ఉంటాయి. ఇది యూజర్ల హార్ట్ బీట్ రేటును లెక్కించడమే కాకుండా ఒత్తిడి స్థాయిలను కూడా ఇది గుర్తించగలదు. ఈ స్మార్ట్‌వాచ్‌లో 100 కి పైగా డౌన్లోడ్ చేయగల వాచ్ ఫేసెస్ దీనిలో ఉన్నాయి. ip 68 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్స్‌ను ఈ స్మార్ట్ వాచ్ కలిగి ఉంటుంది. ఈ వాచ్ కు ఒకసారి ఛార్జింగ్ పెడితే బ్యాటరీ వారం రోజుల పాటు వస్తుంది.

ధర ఎంతంటే..
మెటాలిక్ డిజైన్‌‌తో పాటు హెల్త్‌ ఫీచర్స్ కలిగి ఉన్న ఈ వేవ్ స్టైల్ స్మార్ట్ వాచ్‌ను రూ.1,299 ప్రారంభ ధరతో విడుదల చేశారు. స్మార్ట్ వాచ్ అమెజాన్, ఆన్లైన్ వెబ్ సైట్లతో పాటు ఈ-కామర్స్ వెబ్ సైట్లలో ఈ స్మార్ట్ వాచ్‌ను కొనుగోలు చేయవచ్చు.

Exit mobile version