Ratan Tata: రతన్ టాటాకు ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారం

భారతదేశం-ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో చేసిన కృషికి గాను టాటా సన్స్ ఛైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటాకు ఆస్ట్రేలియా యొక్క అత్యున్నత పౌర గౌరవం ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియాతో సత్కరించారు.

  • Written By:
  • Publish Date - April 25, 2023 / 07:24 PM IST

 Ratan Tata: భారతదేశం-ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో చేసిన కృషికి గాను టాటా సన్స్ ఛైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటాకు ఆస్ట్రేలియా యొక్క అత్యున్నత పౌర గౌరవం ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియాతో సత్కరించారు.

భారతదేశంలోని ఆస్ట్రేలియా హైకమీషనర్, బారీ ఓ’ఫారెల్, వేడుక చిత్రాలను ట్విట్టర్‌లో పంచుకున్నారు. రతన్ టాటా తమదేశంపై గణనీయమైన ప్రభావాన్ని చూపారని అన్నారు.రతన్ టాటా బిజినెస్ టైటాన్ . భారతదేశంలోనే కాదు, ఆస్ట్రేలియాలో కూడా అతను గణనీయమైన ప్రభావాన్ని చూపారు. రతన్ టాటా దీర్ఘకాల నిబద్ధతకు గుర్తింపుగా ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా (AO) గౌరవాన్ని అందించడం ఆనందంగా ఉందని  దౌత్యవేత్త  తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఆస్ట్రేలియాలో  అతిపెద్ద సంస్దగా..(Ratan Tata)

భారతదేశం-ఆస్ట్రేలియా సంబంధాలను పెంపొందించడానికి, ప్రత్యేకంగా వాణిజ్యం, పెట్టుబడులు మరియు దాతృత్వంలో చేసిన సేవ కోసం ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా (AO) గౌరవం లభిస్తుంది. రతన్ టాటా మార్చి 1991లో టాటా గ్రూప్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి 2012లో పదవీవిరమణ చేశారు.2022 భారతదేశం-ఆస్ట్రేలియా ఆర్థిక సహకారం మరియు వాణిజ్య ఒప్పందం కోసం కృషి చేసారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సుమారు 17,000 మంది ఉద్యోగులతో అతిపెద్ద  సంఖ్యలో ఆస్ట్రేలియా సిబ్బందిని  కలిగి ఉన్న భారతీయ సంస్దగా నిలిచింది.

అక్టోబర్ 2022లో, టాటా తన దాతృత్వ కార్యక్రమాల కోసం ఆర్ఎస్ఎస్ అనుబంధ సేవా భారతి నుండి ‘సేవా రత్న’ అందుకున్నారు. అతను 2008లో భారతదేశం యొక్క రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌ని అందుకున్నారు.ఇటీవల మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారతదేశంలోని టాటా సన్స్ ఛైర్మన్ మరియు టాటా గ్రూప్ చైర్‌పర్సన్ నటరాజన్ చంద్రశేఖరన్‌ను కలిసారు. టాటా మరియు గేట్స్ తమ సహకారాన్ని పెంపొందించుకోవడం మరియు పోషకాహారం కోసం కలిసి పనిచేయడం గురించి చర్చించారు.