Personal loan: చాలామంది కొన్ని అత్యవసర పరిస్థితుల్లో వ్యక్తిగత రుణం తీసుకుంటారు. కొందరు ఛార్జీలపై పెద్దగా అవగాహన లేకుండానే వ్యక్తిగత రుణం తీసుకుంటారు. కానీ ఇది సరైన పద్దతి కాదు. పర్సనల్ లోన్ తీసుకునే ముందు కచ్చితంగా బ్యాంకులు వసూలు చేసే ఛార్జీల గురించి తెలుసుకోవాలి. అజాగ్రత్తగా వ్యవహారిస్తే.. బ్యాంకులు అధిక మెుత్తంలో ఛార్జీలను వసూలు చేస్తాయి.
ఛార్జీల గురించి తెలిసుండాలి.. (Personal loan)
చాలామంది కొన్ని అత్యవసర పరిస్థితుల్లో వ్యక్తిగత రుణం తీసుకుంటారు. కొందరు ఛార్జీలపై పెద్దగా అవగాహన లేకుండానే వ్యక్తిగత రుణం తీసుకుంటారు. కానీ ఇది సరైన పద్దతి కాదు. పర్సనల్ లోన్ తీసుకునే ముందు కచ్చితంగా బ్యాంకులు వసూలు చేసే ఛార్జీల గురించి తెలుసుకోవాలి. అజాగ్రత్తగా వ్యవహారిస్తే.. బ్యాంకులు అధిక మెుత్తంలో ఛార్జీలను వసూలు చేస్తాయి.
అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక కష్టాల నుంచి బయట పడటానికి వ్యక్తిగత రుణం ఉపయోగపడుతుంది. ప్రస్తుతం కాలంలో వ్యక్తిగత రుణం త్వరగా అందుతుంది. ఈ రుణం పొందే సమయంలో ఎటువంటి డాక్యుమెంట్లు సమర్పించే అవసరం ఉండకపోవడమే ఇందుకు కారణం. కానీ కొన్ని బ్యాంకులు రుణాలు తీసుకునే సమయంలో ఛార్జీలను వసూలు చేస్తాయి. అలాంటి సమయంలో ఛార్జీల గురించి తెలుసుకోవడం ముఖ్యం..
ప్రాసెసింగ్ ఛార్జీలు
ప్రతి బ్యాంకు వివిధ ఫీజులను వసూలు చేస్తాయి. రుణాన్ని మంజూరు చేసేందుకు అయ్యే ఖర్చులను లోన్ తీసుకునే వ్యక్తి నుంచే వసూలు చేస్తారు. ఇది రుణం తీసుకునే ప్రతి ఒక్కరు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజులను బ్యాంకులే నిర్ణయిస్తాయి. చాలా బ్యాంకులు 0.25 శాతం నుంచి 2.5 శాతం వరకు వసూలు చేయగా.. మరికొన్ని బ్యాంకులు 3 శాతం వరకు కూడా వసూలు చేస్తాయి.
వెరిఫికేషన్ ఛార్జీలు
లోన్ విడుదల చేసే సమయంలో.. బ్యాంకులు తగిన జాగ్రత్తలు తీసుకుంటాయి. తీసుకునే వ్యక్తి లోన్ చెల్లించే స్థితిలో ఉంటేనే లోన్ మంజూరు చేస్తుంది.
మీ చెల్లింపు సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి బ్యాంక్‌కు చెందిన వ్యక్తి గానీ, థర్డ్ పార్టీ వ్యక్తి గానీ మీ వివరాలను తెలుసుకుంటారు.
మీ రుణ చరిత్ర, క్రెడిట్ రిపోర్ట్ వంటివి పరిశీలిస్తారు. దీని కోసం బ్యాంక్ కొంత మొత్తాన్ని ఖర్చు చేస్తుంది. ఆ మొత్తాన్ని కూడా వెరిఫికేషన్ ఛార్జీల పేరిట రుణగ్రహీత నుంచి వసూలు చేస్తుంది.
ఈఎంఐ కట్టకపోతే
కొన్ని సందర్భాల్లో కొందరు సమయానికి ఈఎంఐ చెల్లించలేకపోతారు. అలాంటి సందర్భాల్లో బ్యాంకులు రూ. 500 వరకు పన్ను వసూలు చేస్తుంది.
ఇలాంటివి జరగకుండా ఉండేందుకు.. కొంత సొమ్మును అకౌంట్ లో దాచుకోవాలి. ఈ ఛార్జీలు బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది.
కాబట్టి ఈఎంఐలను సకాలంలో చెల్లించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. చెల్లింపు సామర్థ్యాన్ని బట్టి కాలవ్యవధి, ఈఎంఐ మొత్తాన్ని ఎంచుకోవాలి.
ముందస్తు చెల్లింపులు చేసినా..
నగదు ఉన్న సమయంలో కొందరు ముందస్తు ఈఎంఐ చెల్లిస్తారు. అందువల్ల కూడా బ్యాంకులు పెనాల్టీలు విధిస్తాయి.
సాధారణ బ్యాంకులు వ్యక్తిగత రుణ చెల్లింపులపై 2-4 శాతం వరకు పెనాల్టీని విధిస్తున్నాయి.
రుణ చెల్లింపుల్లో మిగిలిన కాలానికి అసలుపై ప్రీపేమెంట్ , ఫోర్‌క్లోజర్ పెనాల్టీ పేరిట ఈ ఛార్జీలను వసూలు చేస్తాయి.
బ్యాంకును బట్టి ఈ ఛార్జీలు మారుతూ ఉంటాయి. కొన్ని బ్యాంకులు రుణం తీసుకున్న 12 నెలల తర్వాత మాత్రమే ముందస్తు చెల్లింపులకు అనుమతిస్తాయి.