Air India offers Sale: రిపబ్లిక్ డే సందర్భంగా ఎక్కడ చూసినా ఆఫర్లు నడుస్తున్నాయి. ఈ కామర్స్ దిగ్గజ సంస్థలు ఆఫర్లతో ఆకట్టుకుంటాయి. దీంతో ప్రజలు కూడా పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేస్తారు.
ఈ క్రమంలోనే ప్రముఖ ఎయిర్ లైన్స్ ఎయిరిండియా Air India విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.
రిపబ్లిక్ డే సందర్భంగా తక్కువ ధరలకే విమాన ప్రయాణ అవకాశం కల్పిస్తున్నట్టు వెల్లడించింది. ఈ ఆఫర్స్ దేశీయ నెట్ వర్క్ లోని విమాన టికెట్ల( Flight tickets) పై ఉండనున్నాయి.
ఎయిర్ ఇండియా ‘ఫ్లై ఎయిరిండియా సేల్’పేరుతో అందిస్తున్న ఈ స్పెషల్ ఆఫర్లు ఈ నెల 23 వరకు అందుబాటులో ఉంటాయి. రేపటి లోపు ఎయిర్ఇండియాలో తక్కువ ధరలకే టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
ఫిబ్రవరి 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య దేశీయ ప్రయాణాలపై మాత్రమే ఈ ఆఫర్ చెల్లుబాటు అవుతుంది. అయితే ఈ ఆఫర్ లో లిమిటెడ్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
ఎకానమీ క్లాసులో లభించే ఈ ఆఫర్ టికెట్లను ఎయిర్ఇండియా(Air India offers ) కు చెందిన అధికారిక ట్రావెల్ ఏజెంట్స్ సహా అన్ని బుకింగ్ ప్లాట్ ఫామ్స్ వద్ద టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.
ఆఫర్స్ లో చార్జీలు
ఈ ఆఫర్ లో వన్ వేలో ప్రయాణ ఛార్జీ రూ. 1705 తో ప్రారంభమవుతుంది.
ఢిల్లీ టూ ముంబై – రూ. 5075
చెన్నై టూ ఢిల్లీ – రూ. 5895
బెంగళూరు టూ ముంబై – రూ. 2319
ఢిల్లీ టూ ఉదయ్ పూర్ – రూ. 3680
ఢిల్లీ టూ గోవా – రూ.5656
ఢిల్లీ టూ పోర్ట్ బ్లెయిర్ – రూ. 8690
ఢిల్లీ టూ శ్రీనగర్ – రూ. 3730
అహ్మదాబాద్ టూ ముంబై – రూ. 1806
గోవా టూ ముంబై – రూ. 2830
దిమాపూర్ టూ గౌహతి – రూ. 1783
మొత్తం 49 రూట్లకు పైగా ఈ ఆఫర్ వర్తించనుంది. దేశీయ గమ్యస్థానాలకు ప్రజలు తగ్గింపు ధరతో టికెట్లు బుక్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది.
కాగా, కరోనా తర్వాత విమానయాన రంగం ఇప్పుడిప్పుడే కుదుట పడుతోంది. ఎయిర్ ఇండియా టేకోవర్ చేసిన టాటా గ్రూపు పురరుద్దరణ ప్రణాళికలను అమలు చేస్తోన్న విషయం తెలిసిందే.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/