Aadhaar: ఉచితంగా ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు జూన్ 14 తో గడువు ముగియనుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని యూఐడీఏఐ ( భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ) మార్చి 15 నుంచి ఉచితంగా అప్ డేట్ చేసేందుకు అవకావం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఇచ్చిన గడువు రేపటితో ముగుస్తోంది.
ఆధార్ కార్డు తీసుకుని 10 ఏళ్లు గడిచిన వారు ఆధార్ కార్డు తప్పనిసరిగా అప్ డేట్ చేసుకోవాలి. జూన్ 14 లోపల ఆధార్ పోర్టల్లో ఉచితంగా వివరాలను అప్ డేట్ చేసుకోవచ్చని తెలిపింది. ఆధార్ కార్డులోని పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, లింగం, ఫోన్ నెంబర్, ఈ మెయిల్ లాంటివి ఫ్రీగా అప్ డేట్ చేసుకునే వీలు ఉంది. ఫొటో, ఐరిస్, బయోమెట్రిక్ వివరాల కోసం ఆధార్ సెంటర్ లో రూ. 50 ఫీజు చెల్లించి అప్ డేట్ చేసుకోవచ్చు.
ఆధార్ నెంబర్ ద్వారా https://myaadhaar.uidai.gov.in/ వెబ్‌సైట్‌లో లాగిన్ కావాలి.
‘ప్రొసీడ్ టు అప్‌డేట్ అడ్రస్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది.
ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ‘డాక్యుమెంట్ అప్‌డేట్’ పై క్లిక్ చేయాలి. దీంతో అప్పటికే ఉన్న వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఒకవేళ వాటిలో ఏదైనా మార్పులు ఉంటే
చేసుకోవచ్చు. లేదా ఉన్న వివరాలను వెరిఫై చేసుకొని నెక్ట్స్ అనే బటన్ పై క్లిక్ చేయాలి.
తర్వాత కనిపించే డ్రాప్‌డౌన్ లిస్ట్ నుంచి ‘ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్’ డాక్యుమెంట్లను సెలెక్ట్ చేసుకోవాలి.
సంబంధిత డాక్యుమెంట్ల స్కాన్డ్ కాపీలను అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
అన్నీ కంప్లీట్ అయ్యాక 14 అంకెల ‘అప్‌డేట్ రిక్వెస్ట్ నెంబర్’ వస్తుంది. దీని ద్వారా అప్‌డేట్ స్టేటస్ ఎక్కడి వరకు వచ్చిందో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు.